క్లైమాక్స్ లో 'పెద్ది'..ఫస్ట్ హాఫ్ కట్ రెడీగా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Srikanth Kontham | 13 Jan 2026 12:28 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఆర్సీ 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అన్ని పనులు పూర్తి చేసి పాన్ ఇండియాలో మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ తేదీ విషయంలో టీమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదికే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బుచ్చిబాబు అండ్ కో పని చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. లిరికల్స్ సింగిల్స్ రూపంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు.
తొలి లిరికల్ `చికిరి చికిరి` పాట ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అన్ని పాటల రికార్డులను `చికిరి చికిరి` తిరగరాసింది. మోస్ట్ లవ్ బుల్ సాంగ్ గా నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. రెహమాన్ ఈజ్ బ్యాక్ అనిపించిన సాంగ్ ఇది. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు పనిచేయడం ...తొలి సాంగ్ సక్సెస్ అవ్వడంతో అతడు అంతే సంతోషంగా ఉన్నాడు. తర్వాత రిలీజ్ అయ్యే పాటలు ఎలా ఉంటాయి? అని శ్రోతల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో తాజాగా షూటింగ్ అప్ డేట్ కూడా వచ్చేసింది.
బ్యాలెన్స్ షూటింగ్ చకాచకా పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఓ భారీ సెట్ లో చరణ్ సహా ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రధమార్ధం కట్ మొత్తం సిద్దమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అందులో మరేవ్వరు క్రాస్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. అంత కాన్పిడెంట్ గా బుచ్చిబాబు ప్రధమార్దం రెడీ చేసి పెట్టాడు.
అలాగే సెకాండాఫ్ కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అందుకోసం టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఈ నెలఖరుకల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయడమే టార్గెట్ గా పని చేస్తున్నారు. మొత్తానికి జనవరి కల్లా టీమ్ రిలాక్స్ అయిపోతుందని తెలుస్తోంది. బుచ్చిబాబు తన రెండవ సినిమాకు సంబంధించి కూడా షూట్ అంతా ఇండియాలోనే చేసాడు. విదేశాలకు వెళ్లింది లేదు. పాటల కోసం కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు. స్టోరీ ఆధారంగా టాకీ సహా పాటల చిత్రీకరణ కూడా ఇక్కడే ముగించాడు. ఇలా చేయడం వల్ల నిర్మాతకు చాలా వరకూ ఖర్చు ఆదా అవుతుంది. తొలి సినిమా `ఉప్పెన` కూడా బుచ్చిబాబు అలాగే పూర్తి చేసాడు. చరణ్ సినిమాకు సైతం అదే స్ట్రాటజీ అనుసరిస్తున్నాడు.
