Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 'పెద్ది'.. ఇంకొక పెద్ద పని పూర్తయినట్లే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది.

By:  M Prashanth   |   7 May 2026 4:45 PM IST
రామ్ చరణ్ పెద్ది.. ఇంకొక పెద్ద పని పూర్తయినట్లే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్లింప్స్‌, పాటలతో మంచి హైప్ తెచ్చుకున్న ఆ సినిమాపై తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. మూవీ ఫైనల్ ఎడిట్ పూర్తైందని మూవీ టీమ్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది





ఎడిటింగ్ రూమ్‌ లో దర్శకుడు బుచ్చిబాబు, ఎడిటర్ నవీన్ నూలి ఉన్న ప్రత్యేక ఫొటోను విడుదల చేస్తూ పెద్ది ఎడిట్ లాక్ అంటూ మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా ఇప్పుడు కంప్లీట్ గా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లినట్లు అయింది. ఆ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు మరోసారి అనౌన్స్ చేశారు. అంతేకాకుండా జూన్ 3 నుంచే ఓవర్సీస్‌ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ పై కూడా ప్రకటన రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. జూన్ 3 నుంచే థియేటర్లలో మాసివ్ బ్లాస్ట్ మొదలవుతుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం చరణ్ లుక్, స్టోరీ లైన్. 1970-80ల కాలంలో విజయనగరం బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా సినిమాను రూపొందించినట్లు సమాచారం.

గ్రామీణ వాతావరణం, ఎమోషన్స్, భారీ యాక్షన్ సీన్స్ కలగలిపి బుచ్చిబాబు సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి మళ్లీ అదే రేంజ్ మాస్, ఎమోషనల్ ఫీల్.. పెద్ది సినిమాలో ఉండబోతుందనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ప్రత్యేకంగా చరణ్ ఆ చిత్రం కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ లో ఆయన రఫ్ అండ్ మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌, ఎమోషనల్ సీన్స్ ప్రధాన హైలైట్స్‌ గా నిలుస్తాయని సమాచారం. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎమోషన్స్ తో బయటకు వస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌ లో శృతి హాసన్ కనిపించనున్నట్లు సమాచారం.

సాంకేతికంగా కూడా సినిమాకు భారీ స్థాయి క్రేజ్ ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. భారీ సెట్స్‌ తో ఆ చిత్రాన్ని రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా వర్క్ పై కూడా ఇప్పటికే చర్చ జరుగుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలో ట్రైలర్‌ ను భారీ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం చూస్తుంటే పెద్ది కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టే భారీగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది.