పెద్ది మూవీ నుండీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్!
ఇదిలా ఉండగా నిన్న వాట్ ఈజ్ చికిరి ? అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 5 Nov 2025 12:36 PM ISTగ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు ఆ ట్యాగ్ ను కూడా తొలగించి.. తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ చిత్రం ఏదో కాదు పెద్ది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నారు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా నిన్న వాట్ ఈజ్ చికిరి ? అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టూడియోలో ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు డిస్కషన్ చేసుకుంటున్నట్టు ఆ పోస్టర్ ను విడుదల చేశారు. అన్నట్టుగానే ఈరోజు ఆ చికిరి మీనింగ్ ఏంటో చెప్పేసి ఫస్ట్ సింగిల్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. మరి బుచ్చిబాబు సనా చెప్పిన ఆ చికిరి అర్థం ఏమిటి? ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ప్రోమో ఎలా ఉంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఈ చికిరి పాటను రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.. ఈ పాటకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. మోహిత్ చౌహన్ ఆలపించారు. ఈ పాట కోసం ఏ ఆర్ రెహమాన్, మోహిత్ మీద స్పెషల్ వీడియో కూడా షూట్ చేశారు బుచ్చిబాబు సన. ఈ స్పెషల్ వీడియోలో చికిరి గురించి అర్థం చెబుతూ.. కొండల్లో ఉంటున్న హీరో రామ్ చరణ్ తొలిసారి హీరోయిన్ జాన్వినీ చూసే సందర్భంలో వచ్చే పాట చికిరి. ఈ పాటకు బాణీ కోసం రెహమాన్ కు సందర్భాన్ని వివరించేటప్పుడు.. కాటుక అక్కర్లేని కళ్ళు.. ముక్కుపుడక అక్కర్లేని ముక్కు.. అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి రా ఈ చికిరి అని చెబుతాడు..
అసలు ఆ చికిరి అంటే ఏంటి ? అని రెహమాన్ అడగగా.. వాళ్ళ ఊరిలో ఆడపిల్లలను ముద్దుగా, ప్రేమగా చికిరి అని పిలుస్తారు అని చెప్పారు.ఇక ఆ చికిరి పదం మీద రెహమాన్ పాట పాడేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా పూర్తి పాటను నవంబర్ ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రోమో చివర్లో ప్రకటించారు.. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త పాటపై అంచనాలను పెంచేసింది. ఇకపోతే ఇక్కడ రామ్ చరణ్ హుక్ స్టెప్పు కూడా ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పవచ్చు.
