చరణ్ సాహసం.. 'చికిరి' వెనుక ఇంత కథ ఉందా!
ఒక పాట తెరపై చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, దాని వెనుక ఉండే కష్టం అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
By: M Prashanth | 27 Nov 2025 6:37 PM ISTఒక పాట తెరపై చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, దాని వెనుక ఉండే కష్టం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది సాంగ్ వెనుక పెద్ద సాహసమే జరిగింది. కేవలం కొన్ని నిమిషాల పాట కోసం యూనిట్ మొత్తం పడిన శ్రమ చూస్తే వామ్మో అనాల్సిందే. ఆ విజువల్స్ కోసం వాళ్లు చేసిన రిస్క్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఔట్ డోర్ షూటింగ్ అంటే కార్లలో వెళ్తారు, షూట్ చేస్తారు. కానీ ఇక్కడ లొకేషన్ కు వెళ్లడమే ఒక పెద్ద టాస్క్. కొండలు, గుట్టలు దాటుకుంటూ, ఏకంగా తాళ్ల సాయంతో కొండను ఎక్కాల్సి వచ్చింది. ఆ లొకేషన్ కు చేరుకోవడానికే టీమ్ కు చుక్కలు కనిపించాయి.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' సినిమాలోని "చికిరి చికిరి" సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. 100 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ పాట మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ కొండ పైకి వెళ్లడానికి టీమ్ ఏకంగా 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చిందట. ఆ వీడియోలో చరణ్ కూడా తాళ్లు పట్టుకుని కొండ ఎక్కుతున్న దృశ్యాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ మేకింగ్ వీడియోలో చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు మధ్య ఉన్న బాండింగ్ హైలైట్ గా నిలిచింది. చరణ్ ఆప్యాయంగా బుచ్చిబాబును "తలా" అని పిలవడం, ఇద్దరూ కలిసి జోకులు వేసుకోవడం ఆకట్టుకుంది. "చిరుత సినిమా టైమ్ లో థియేటర్లో మీ సాంగ్స్ కోసం వెయిట్ చేశాం, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నా" అంటూ బుచ్చిబాబు ఎమోషనల్ అవ్వడం, దానికి చరణ్ నవ్వడం బాగుంది.
అంత కష్టపడి వెళ్లారు కాబట్టే, అక్కడ అంత అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. కొండ అంచున చరణ్ వేసిన ఆ వైరల్ హుక్ స్టెప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. కేవలం ఆ ఒక్క లొకేషన్ వైబ్ కోసమే ఇంత రిస్క్ తీసుకున్నారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ గ్రేస్, టీమ్ కష్టం కలిసి ఈ పాటను గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలబెట్టాయి.
'పెద్ది' సినిమా కోసం టీమ్ ఎంత డెడికేటెడ్ గా పని చేస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ కి వెళ్లాయి. ఒక్క పాటతోనే ఇంత రచ్చ చేస్తే, ఇక సినిమా వస్తే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
