చరణ్ 'పెద్ది' లెక్కలు.. ఇప్పటి వరకు ఎంతంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది.
By: M Prashanth | 17 Jun 2026 5:47 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఆ చిత్రం తాజాగా మరో మైల్ స్టోన్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్ ను దాటినట్లు మూవీ టీమ్ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ లుక్, బుచ్చిబాబు స్టోరీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కలిసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పుడు 2026లో సౌత్ ఇండియాలోనే నెం.1 గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది.
అయితే ఆ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.350 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. భారీ క్యాస్టింగ్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి ఆ రేంజ్ బడ్జెట్ కు కారణమయ్యాయి. విడుదలకు ముందే సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ జరగడంతో సినిమాపై అందరి దృష్టి పడింది. అయితే థియేట్రికల్ బిజినెస్ పూర్తిస్థాయిలో లాభాల్లోకి రావాలంటే ఇంకా మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ది స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సినిమా అంచనాలకు మించి వసూళ్లు సాధించినట్లు టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా మొదటి రెండు వారాల్లోనే భారీ షేర్ రాబట్టి అక్కడి బయ్యర్లకు రిలీఫ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తెలుగు మార్కెట్ లో ఆ సినిమా క్లియర్ సక్సెస్ సాధించినట్లే కనిపిస్తోంది. అయితే హిందీ మార్కెట్ తో పాటు కొన్ని ఓవర్సీస్ ఏరియాల్లో మాత్రం వసూళ్లు ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదని తెలుస్తోంది. అక్కడి నుంచి మరింత మెరుగైన ఆదాయం వస్తే సినిమా థియేట్రికల్ పరంగా మరింత స్ట్రాంగ్ పొజిషన్ కు చేరుకునే అవకాశం ఉందట.
మరోవైపు నిర్మాతలకు మాత్రం పెద్దగా ఆందోళన అవసరం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. థియేటర్లకు ముందు నుంచే డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మంచి ఆదాయం వచ్చినట్లు సమాచారం. అలా నాన్ థియేట్రికల్ రైట్స్ కారణంగా నిర్మాణ సంస్థ ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్లిందని వినికిడి. ఇప్పటికే రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ పెద్ది అందుకోగా.. ఇప్పుడు అందరి చూపును రూ.500 కోట్ల మార్క్ పై పడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాంగ్ రన్ కొనసాగితే, ఇతర ప్రాంతాల్లో వసూళ్లు పెరిగితే ఆ టార్గెట్ చేరుకోవడం అసాధ్యం కాదని చెప్పాలి. ఏదేమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్దికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లగా, ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ లాభాల్లోకి చేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో భారీ సక్సెస్ ఫుల్ మూవీగా పెద్ది నిలిచే దిశగా అడుగులు వేస్తోంది.
