Begin typing your search above and press return to search.

పెద్ది: బాక్సాఫీస్ ఆట అంత ఈజీ కాదు

రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   3 Jun 2026 9:21 AM IST
పెద్ది: బాక్సాఫీస్ ఆట అంత ఈజీ కాదు
X

రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా హక్కుల అమ్మకాల విషయంలో వినిపిస్తున్న నంబర్లు చూస్తుంటే ఇండస్ట్రీకే దడ పుడుతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 500 కోట్ల గ్రాస్ రాబట్టాలి అనే టాక్ బలంగా నడుస్తోంది. ఇంత భారీ టార్గెట్ ను ఈ సినిమా రీచ్ అవ్వాలంటే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబట్టాలి.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులే జీఎస్టీతో కలుపుకుని దాదాపు 165 కోట్ల వరకు అమ్ముడయ్యాయని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు నిజమైతే, ఇక్కడ బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఏకంగా 270 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ఆ స్థాయి నంబర్ ను టచ్ చేయడం అంత సులభం కాదు. దీనికోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టాల్సిన అవసరం ఉంది.

ఇక అసలు పరీక్ష నాన్ తెలుగు మార్కెట్లలోనే ఎదురుకానుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు 55 కోట్లకు వెళ్లాయని, ఓవర్సీస్ లో 40 కోట్లకు డీల్ క్లోజ్ అయిందని ట్రేడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం అక్కడ బయ్యర్లు గట్టెక్కాలంటే కనీసం 225 కోట్ల గ్రాస్ రావాలి. కంటెంట్ లో యూనివర్సల్ అప్పీల్ ఉండి హిందీ, తమిళ్ లాంటి భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ అయితేనే ఈ పాన్ ఇండియా ఫీట్ సాధ్యమవుతుంది.

ఇప్పటివరకు టాలీవుడ్ తరఫున 500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప 2 లాంటి భారీ చిత్రాలకు మాత్రమే ఇది సాధ్యపడింది. ఆ సినిమాల సక్సెస్ సీక్రెట్ చూస్తే ఫస్ట్ వీకెండ్ హడావిడి కంటే సెకండ్ వీక్ మౌత్ టాక్ బాగా ప్లస్ అయింది. పెద్ది మూవీకి కూడా అదే ఫార్ములా వర్కౌట్ అవ్వాలి. సలార్ లాగా కేవలం మూడు రోజులు కలెక్షన్స్ వచ్చి తర్వాత డ్రాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవు.

సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ లోనే సులభంగా 200 కోట్లు వసూలు చేసే స్టామినా చరణ్ కు ఉంది. కానీ అసలైన టెస్ట్ సోమవారమే మొదలవుతుంది. టికెట్ రేట్లు పెంచినా సరే, రిపీట్ ఆడియన్స్ రాకపోతే బాక్సాఫీస్ రన్ నెమ్మదిస్తుంది. గతంలో ఆదిపురుష్ సినిమాకు కూడా భారీ బిజినెస్ జరిగింది. టాక్ తేడా కొట్టడంతో బయ్యర్లు తీవ్రంగా దెబ్బతిన్నారు. కాబట్టి ప్రీమియర్స్ తో వచ్చే హైప్ కి, రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. పెద్ది విజయం అనేది కేవలం హీరో స్టార్ డమ్ మీద కాకుండా స్క్రిప్ట్ లోని దమ్ము మీదే ఆధారపడి ఉంది. తెలుగు ఆడియన్స్ కు కావాల్సిన ఎమోషన్, నార్త్ ప్రేక్షకులకు నచ్చే మాస్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.