Begin typing your search above and press return to search.

చరణ్ ల్యాండ్ మార్క్.. 'పెద్ది' మేకర్స్ సర్ప్రైజ్ చూశారా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   29 Sept 2025 1:12 AM IST
చరణ్ ల్యాండ్ మార్క్.. పెద్ది మేకర్స్ సర్ప్రైజ్ చూశారా?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్.. స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంచి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుని సత్తా చాటారు.


ముఖ్యంగా ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సొంతం చేసుకున్న చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చరణ్.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీ పెద్ది మేకర్స్ స్పెషల్ సర్పైజ్ ఇచ్చారు.

చరణ్ కు బెస్ట్ విషెస్ చెబుతూ.. పెద్ది మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో బ్లాక్ కలర్, ఎర్ర రంగు చారలు ఉన్న షర్ట్ ధరించిన మెగా పవర్ స్టార్.. ముక్కుకు పోగుతో.. బీడీ తాగుతూ కనిపించారు. రైల్వే ట్రాక్ పై మాస్ లుక్ లో నిల్చుని ఉన్నారు. పోస్టర్ లో మాసిన జుత్తుతో.. గడ్డంతో ఫుల్ రస్టిక్ లుక్‌ లో కనిపించారు.

అయితే పోస్టర్ తో సర్ప్రైజ్ ఇస్తూ.. మేకర్స్ స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చారు. మా పెద్ది 18 ఏళ్లు సినీ కెరీర్‌ ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వారసత్వం కొనసాగిస్తూనే.. వినయ విధేయత కలిగి ఉండటమే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నారని మేకర్స్ కొనియాడారు.

తమకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలు క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. త్వరలో పెద్ది మూవీ నుంచి చాలా పెద్ద సర్ప్రైజ్‌ లు రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు.

ఇక పెద్ది విషయానికొస్తే.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.