మన హీరోల టాప్ ఓపెనింగ్స్... పెద్దితో మరోసారి చరణ్!
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మొదటి రోజే వంద కోట్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
By: M Prashanth | 5 Jun 2026 3:42 PM ISTరామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మొదటి రోజే వంద కోట్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమాకు టామ్ ఏంటి అనేది తరువాత సంగతి, కానీ సాలీడు ఓపెనింగ్స్ మాత్రం హీరో క్రేజ్ తోనే సాధ్యం. రామ్ చరణ్ స్టార్ డమ్ కారణంగా తొలిరోజు థియేటర్ల దగ్గర భారీ సందడి కనిపించింది. లాంగ్ రన్ లో ఈ వసూళ్ల జోరు ఏ మేరకు కొనసాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ తొలిరోజే భారీ స్థాయిలో వంద కోట్ల కలెక్షన్స్ అందుకున్న లిస్టులో చేరాడు. ఇప్పుడు సోలో హీరోగా పెద్ది సినిమాతో మళ్లీ ఆ మార్క్ ను టచ్ చేశాడు. ఒక పల్లెటూరి కుర్రాడిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చరణ్ పడిన కష్టానికి స్క్రీన్ మీద మంచి మార్కులే పడ్డాయి. ఒక ప్రాంతీయ కథతో పాన్ ఇండియా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో హీరో ఇమేజ్ బాగా ప్లస్ అయింది.
టాలీవుడ్ లో తొలిరోజు వంద కోట్ల గ్రాస్ రాబట్టడం అనేది పాన్ ఇండియా మార్కెట్ మొదలైన తర్వాత ఒక కామన్ ట్రెండ్ గా మారిపోయింది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడో ఈ నంబర్స్ ను క్రాస్ చేశారు. కేవలం భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే కాదు, కంటెంట్ బేస్డ్ కథలకు కూడా క్రేజ్ ఉంటే ఇలాంటి ఓపెనింగ్స్ వస్తాయని పెద్ది నిరూపించింది. హీరో మార్కెట్ కు తగ్గట్లు హైప్ క్రియేట్ అయితే వసూళ్లు వస్తాయి.
ప్రతి సినిమా రిలీజ్ టైమ్ లో ఏ హీరోకు ఎంత ఓపెనింగ్ వస్తుంది అనే చర్చలు ఫ్యాన్స్ మధ్య కామన్ గా జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా మన హీరోల క్రేజ్ ఏంటనేది వాళ్లు సాధిస్తున్న ఈ తొలిరోజు వసూళ్లే క్లియర్ గా చెబుతాయి. ఆ లిస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రభాస్: బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ పార్ట్ 1, కల్కి 2898 AD, రాధేశ్యామ్
జూనియర్ ఎన్టీఆర్: RRR, దేవర పార్ట్ 1
రామ్ చరణ్: RRR, పెద్ది
అల్లు అర్జున్: పుష్ప 2 ది రూల్
పవన్ కళ్యాణ్: OG
ఈ బాక్సాఫీస్ రికార్డుల లెక్కలను గమనిస్తే ప్రభాస్ ఏకంగా ఆరు సినిమాలతో ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ చెరో రెండు సినిమాలతో రెండో స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఒక్కో సినిమాతో ఈ లిస్ట్ లో తమ వంతు చోటు దక్కించుకున్నారు. కేవలం మాస్ యాక్షన్ ఇమేజ్ మాత్రమే కాకుండా కంటెంట్ తో కూడా ఈ నంబర్స్ సాధించడం గొప్ప విషయం. రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి రానున్న మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఈ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి. స్టార్ డమ్ కు తోడు కంటెంట్ కూడా బలంగా ఉంటే ఫస్ట్ డే కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతానికి పెద్ది సినిమా ఇచ్చిన ఈ బూస్ట్ తో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ నంబర్స్ ఇంకో రేంజ్ లో ఉంటాయి.
