Begin typing your search above and press return to search.

మెగా వారసుడి ముందున్న భారీ లక్ష్యాలు!

`ఆర్ఆర్ఆర్` చిత్రంతో గ్లోబల్ వైడ్‌గా అసాధారణ సంచలనాలు సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్అప్ క‌మింగ్ చిత్రాల‌తో ఆ ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేసుకునే ప్ర‌ణాళిక‌తోనే బ‌రిలోకి దిగుతున్నారు

By:  Srikanth Kontham   |   22 May 2026 11:05 AM IST
మెగా వారసుడి ముందున్న భారీ లక్ష్యాలు!
X

`ఆర్ఆర్ఆర్` చిత్రంతో గ్లోబల్ వైడ్‌గా అసాధారణ సంచలనాలు సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్అప్ క‌మింగ్ చిత్రాల‌తో ఆ ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేసుకునే ప్ర‌ణాళిక‌తోనే బ‌రిలోకి దిగుతున్నారు.గ‌త సినిమా `గేమ్ ఛేంజ‌ర్` వైఫ‌ల్యం నేప‌థ్యంలో `పెద్ది`తో అన్ని లెక్క‌లు స‌రిచేయాల‌ని క‌సి మీద ఉన్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోన్న‌`పెద్ది` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్పిన ప‌నిలేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో కొన్ని సందేహాలు తీరిపోయాయి. ఇదీ ప‌క్కా పాన్ ఇండియా కాన్సెప్ట్ ఉన్న చిత్ర‌మ‌ని తేలిపోయింది.

అయితే ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా విజయంతో రామ్ చరణ్ ముందు మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి. `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఉత్తరాది బెల్ట్‌లో చ‌ర‌ణ్ సంపాదించుకున్న భారీ హిందీ మార్కెట్‌, క్రేజ్‌ను అలాగే నిలబెట్టుకోవడం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం చరణ్ అండ్ టీమ్ బాలీవుడ్ మార్కెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేవలం ముంబైకే పరిమితం కాకుండా భూపాల్ వంటి నార్త్ నగరాలలో సైతం భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించి అక్కడి ప్రేక్షకులకు `పెద్ది` చిత్రాన్ని మరింత దగ్గర చేయడానికి సరికొత్త వ్యూహాలతో సిద్ద‌మ‌వుతున్నారు.

ఇక రెండవ లక్ష్యం చూస్తే? పొరుగున ఉన్న తమిళనాట తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకోవడం. గతంలో `మగధీర` చిత్రం తో చరణ్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి త తెలిసిందే. `ఆర్ఆర్ఆర్ ` తో అది నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అయితే సోలో హీరోగా తమిళ సినిమా మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకోవాలనే కసి చరణ్‌లో బలంగా ఉంది. ఈనేప‌థ్యంలో `పెద్ది`తో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బలమైన ట్రేడ్ పట్టును సాధించాలని చూస్తున్నారు. చరణ్ ముందున్న మూడవ విష‌యం. పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల రికార్డులను సృష్టించడం.

ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ రేంజ్ వందల కోట్లకు చేరిన నేప‌థ్యంలో గ్లోబల్ స్టార్‌గా సోలో స్టామినాతో ఓపెనింగ్స్ రాబట్టడం ఎంతో అవసరం. `గేమ్ చేంజర్` ప‌రాజ‌యాన్ని చెరిపేస్తూ మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించాలి. సరిహద్దులతో సంబంధం లేకుండా ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా సరికొత్త రికార్డులను `పెద్ది`తో నెలకొల్పాలని మెగా వారసుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. చివ‌రిగా `పెద్ది` సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. రామ్ చరణ్ పాన్-ఇండియా సోలో స్టార్‌డమ్‌కు అగ్నిపరీక్ష లాంటిది. హిందీ మార్కెట్ నిలకడ, తమిళనాట విస్తరణ, ఆల్-ఇండియా రికార్డుల వేట. ఈ మూడు టార్గెట్లను చరణ్ గనుక రీచ్ అయితే గ్లోబల్ మార్కెట్ రేంజ్ రెట్టింపు అవుతుంది. మరి ఈ మూడు లక్ష్యాలను అధిగమించి మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో? చూడాలి.