Begin typing your search above and press return to search.

ప్లాప్ ల్లో ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం త‌గ్గ‌ని స్టార్లు!

బాలీవుడ్ హీరో అయినా..కోలీవుడ్ హీరోయినా? ఇంకే ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో అయినా వ‌రుస‌గా రెండు..మూడు ప్లాప్ లు ఎదుర‌య్యాయి? అంటే ఆ ప్ర‌భావం సినిమా మార్కెట్ స‌హా ఓపెనింగ్స్ పై ప‌డుతుంది.

By:  Srikanth Kontham   |   15 Feb 2026 9:00 PM IST
ప్లాప్ ల్లో ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం త‌గ్గ‌ని స్టార్లు!
X

బాలీవుడ్ హీరో అయినా..కోలీవుడ్ హీరోయినా? ఇంకే ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో అయినా వ‌రుస‌గా రెండు..మూడు ప్లాప్ లు ఎదుర‌య్యాయి? అంటే ఆ ప్ర‌భావం సినిమా మార్కెట్ స‌హా ఓపెనింగ్స్ పై ప‌డుతుంది. చాలా మంది బాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోల విష‌యంలో ఇది రుజువైంది. స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాల‌న్ లాంటి హీరోలు కూడా ఈ ర‌క‌మైన విప‌త్తును చూసిన వారే. సూర్య‌, కార్తీ, ధ‌నుష్‌, విశాల్ లాంటి కోలీవుడ్ స్టార్లు కూడా సొంత ప‌రిశ్ర‌మ నుంచి ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్న వారే. వారంతా తిరిగి కోలుకోవ‌డానికి ఒక్క హిట్ స‌రిపోలేదు.

ప్ర‌త్యేకించి బాలీవుడ్ స్టార్లు దేశానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిన సంద‌ర్భంలోనూ ఆ హీరోల సినిమాలు ప్లాప్ అయిన సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. క‌నీస ఓపెనింగ్స్ సాధించిన స్టార్లు బాలీవుడ్ లో ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితి ని దాటి రావ‌డానికి మ‌ళ్లీ సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌ట్టింది. కానీ టాలీవుడ్ హీరోల ఇమేజ్ మాత్రం అందుకు భిన్నం అని చెప్పాలి. టాలీవుడ్ లో ఏ హీరో వివాదాల్లో వేళ్లు పెట్ట‌రు. దేశ స‌మ‌గ్ర‌త‌కు సంబంధించిన అంశాల్లోనూ ఎన్న‌డు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసింది లేదు. టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఓపెన్ గా మాట్లాడ‌డు. ఎంత అసంతృప్తి ఉన్నా? లోప‌లే ఉంటుంది త‌ప్ప బ‌హిర్గ‌తం చెయ్య‌రు. ఓ ర‌కంగా టాలీవుడ్ లో హీరోల ఓపెనింగ్స్ సీక్రెట్ కూడా ఇది కూడాఓ కార‌ణం అనొచ్చు.

ఇదంగతా ప‌క్క‌న బెడితే? సినిమా ప్లాప్ తో సంబంధం లేకుండా తాము న‌టించిన సినిమాలు బిజినెస్ చేయ‌డంలో...భారీ ఎత్తున ఓపెనింగ్స్ సాధిచడంలోనూ టాలీవుడ్ లో హీరోలు ఎప్పటికీ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ‌త సినిమా `గేమ్ ఛేంజ‌ర్` ప్లాప్ అయింది. కానీ త‌దుప‌రి సినిమా `పెద్ది` పై ఆ ఆప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పాన్ ఇండియాలో ఆ సినిమాకు జ‌రుగుతోన్న బిజినెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. భారీ ఎత్తున ఈసినిమాకు ఓపెనింగ్స్ ద‌క్కుతాయ‌ని..చ‌ర‌ణ్ కెరీర్ లోనే హాయ్యెస్ట్ ఓపెనింగ్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గ‌త సినిమా `దేవ‌ర`, `వార్ 2` పాన్ ఇండియాలో అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌లమయ్యాయి. కానీ ప్ర‌శాంత్ నీల్ తో ప‌ని చేస్తోన్న ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. తార‌క్ ఇమేజ్ ఎక్క‌డా కింగ లేద‌ని హైప్ చూస్తేనే తెలుస్తోంది. `డ్రాగ‌న్` సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జ‌రుగుతోంది. ఓపెనింగ్స్ ప‌రంగా స‌రికొత్త రికార్డు తార‌క్ పేరిట న‌మోద‌వుతుంద‌ని అంచ‌నాలున్నాయి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇంత వ‌ర‌కూ పాన్ ఇండియా సినిమా చేసింది లేదు. గ‌త సినిమా `గుంటూరు కారం` యావ‌రేజ్ గా ఆడింది.

కానీ రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న `వార‌ణాసి`పై ఇండియాలో అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 3000 కోట్ల‌గా క‌నిపిస్తోంది. అలాగే ప్ర‌భాస్ కి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా క్రేజ్ ను ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయినా? ప్ర‌యోగాల‌కు వెనుకాడ‌డు. ఆ ప్ర‌యోగం ఫెయిలైనా త‌గ్గ‌డు. గ‌త సినిమా `ది రాజాసాబ్` దారుణ‌మైన ప్లాప్ అయింది. కానీ ఈ ప్ర‌భావం ప్ర‌భాస్ సినిమాల‌పై ఎక్క‌డా క‌నిపించ‌లేదు.