Begin typing your search above and press return to search.

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

రామ్ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC17’ కోసం చరణ్ కొత్త మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టుగా కండలు తిరిగిన శరీరాకృతి నుంచి లీన్ అండ్ స్టైలిష్ లుక్‌లోకి మారేందుకు ప్రత్యేక వర్కౌట్స్, డైట్ ప్లాన్‌ను అనుసరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్‌పై కూడా సుకుమార్ సూచనల మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

By:  Srikanth Kontham   |   14 Nov 2026 3:00 PM IST
ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `RC17`లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ప్రాజెక్ట్ పై బిజీగా ఉన్నారు. `రంగస్థలం` తర్వాత ఇద్ద‌రు మ‌రోసారి జోడీ క‌ట్ట‌డంతో? అంచ‌ నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. ఆ చిత్రాన్ని మించిన విజ‌యాన్ని..తాజా పాన్ ఇండియా సినిమా ఫ‌లితాల‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని ప‌ని చేయాల్సిన ప్రాజెక్ట్ కావ‌డంతో? ఎంతో జాగ్ర‌త్త‌గా ముందు కెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రామ్ చ‌ర‌ణ్ మేకోవర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

పాత్ర డిమాండ్‌కు తగ్గట్టుగా శరీరాకృతిని.. హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేకోవర్ వెనుక సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. కథా నేపథ్యం, పాత్ర స్వభావం ఎలా ఉండబోతుందనే దానిపై సుకుమార్ కొన్ని సూచనలు..సలహాలు ఇవ్వడంతో చరణ్ అందుకు త‌గ్గ‌ట్లు సిద్ధమ వుతున్నారు. గత చిత్రాల కోసం పెంచిన కండరాల శరీరాకృతిని పక్కన పెట్టి కొత్త సినిమా కోసం పూర్తిగా లీన్ అండ్ స్టైలిష్ లుక్‌లోకి మారుతున్నారు. దీనికోసం చ‌ర‌ణ్ ప్రత్యేకమైన వర్కవుట్.. డైట్ ప్లాన్‌ను కూడా ఫాలో అవుతున్నట్లు స‌మాచారం.

సుకుమార్ సినిమాల్లో హీరోల బాడీ లాంగ్వేజ్ ..గెటప్ ప్రత్యేకంగా.. రస్టిక్ అర్బన్ షేడ్స్‌లో ఉంటాయి. `రంగస్థలం`లో చిట్టిబాబు పాత్ర కోసం పూర్తిగా గ్రామీణ యువకుడిగా కనిపించిన చరణ్ కొత్త సినిమా కోసం మాత్రం మోడ్రన్.. సరికొత్త అప్పీయరెన్స్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. సుకుమార్ అందించిన గైడ్ లైన్స్ ప్రకారం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, మేకప్ టెస్ట్‌లను ఇప్పటికే యూనిట్ పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో చ‌చ‌ర‌ణ్ లుక్ పై ఆస‌క్తి అంకంత‌కు రెట్టింపు అవుతుంది. చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంది? అన్న దానిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సైతం మొద‌లైంది.

రంగ‌స్థ‌లం, పుష్ప గ్రామీణ నేప‌థ్యం కావ‌డంతో? ఆర్సీ 17 మాత్రం ఆ రెండు చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని అంతా గెస్ చేస్తున్నారు. ఓ స్టైలిష్ చిత్రాన్నే మెగా అభిమానుల‌కు అందిస్తార‌ని ఆశీస్తున్నారు. మ‌రి సుకుమార్ ఆ ర‌కంగా ముందుకెళ్తున్నారా? మ‌రేదైనా కొత్త ఫార్ములాతో ఉన్నారా? అన్న‌ది తెలియాలి. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టా త్మకంగా నిర్మిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తారు? అన్న దానిపైనా ఆస‌క్తి నెల‌కొంది. ఓ వైపు సుకుమార్ అండ్ హీరోయిన్ వేట‌లోనూ బిజీగా ఉంది.