Begin typing your search above and press return to search.

మళ్లీ చర్చల్లో గేమ్ ఛేంజర్.. ఎందుకంటే..?

శంకర్ తో పనిచేయాలన్న ఒకే ఒక్క ఆలోచనతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేశాడు.

By:  Ramesh Boddu   |   27 Sept 2025 12:30 PM IST
మళ్లీ చర్చల్లో గేమ్ ఛేంజర్.. ఎందుకంటే..?
X

శంకర్ తో పనిచేయాలన్న ఒకే ఒక్క ఆలోచనతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేశాడు. శంకర్ సినిమాలు ఒకప్పుడు ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేశాయి కానీ ఇప్పుడు అలా కాదు. ఈమధ్య ఆయన పూర్తిగా ట్రాక్ తప్పారు. RRR తర్వాత ఆచార్య మిస్ ఫైర్ అయినా గేమ్ ఛేంజర్ అది కూడా శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అదిరిపోతుందని అనుకున్నారు. కానీ సినిమా భారీ లాసులను తెచ్చింది. ఐతే గేం ఛేంజర్ సినిమా రామ్ చరణ్ చేయకుండా ఉండాల్సిందని మెగా ఫ్యాన్స్ అంటుంటారు.

కింగ్ డమ్ సినిమా టైం లో..

అంతేకాదు ఆ సినిమా కోసం కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని కూడా వదిలి పెట్టాడన్న టాక్ నడుస్తుంది. మొన్న కింగ్ డమ్ సినిమా టైం లో గౌతం తో చరణ్ సినిమా ఎందుకు కాదన్నాడు అంటూ డిస్కషన్ నడిచింది. శంకర్ తో సినిమా కోసం గౌతం సినిమా పక్కన పెట్టాడు చరణ్. ఇప్పుడు అదే శంకర్ గేమ్ ఛేంజర్ కోసం సుజిత్ ని కూడా లైట్ తీసుకున్నాడని తెలుస్తుంది. సుజిత్ సాహో సినిమా తర్వాత బాలీవుడ్ లో ఒక ఆఫర్ వస్తే ఆ పనుల్లో ఉన్నాడట.

ఐతే ఆ టైం లోనే టాలీవుడ్ నుంచి మెగా ఆఫర్ రాగానే దాన్ని పక్కన పెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడట. కానీ ఆ హీరో సుజిత్ తో చేయడాని ముందే వేరే ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. అదే గేమ్ ఛేంజర్ అని టాక్. సో చరణ్ తో సుజిత్ సినిమా పడాల్సింది కానీ కుదరలేదు అన్నమాట. ఆ తర్వాత ఓజీ కథ పవన్ కళ్యాణ్ కి చెప్పడం ఆయన ఓకే చేసి సినిమా చేయడం అంతా జరిగింది.

OG చూశాక చరణ్ సుజిత్ తో..

ఓజీ సినిమా ముందే చరణ్, సుజిత్ సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు ఓజీ చూశాక చరణ్ సుజిత్ తో సినిమా ఛాన్స్ అంటే మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడు అని చెప్పొచ్చు. గేమ్ ఛేంజర్ ఒక్క సినిమా వల్ల చరణ్ దాదాపు రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్ లను వదులుకున్నాడు. అందుకే ప్రతి సినిమా టైంలో చరణ్ గేమ్ ఛేంజర్ డిస్కషన్స్ లో వస్తుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. సుజిత్ తో సినిమా మాత్రం ఇప్పుడప్పుడే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.