రామ్ చరణ్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన రెండు సినిమాలు...
తొందర్లోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.
By: Gopi Velupala | 18 Oct 2026 8:00 PM IST'చిరుత' సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. తొందర్లోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఒక రెండు సినిమాలు అతన్ని మాస్ హీరోగా నిలబెట్టాయి... అందులో ఒకటి మగధీర కాగా, మరొకటి రంగస్థలం...
మగధీరతో బాక్సాఫీస్ సునామి...
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర మూవీలో రామ్ చరణ్ వారియర్ గా కనిపించాడు. 400 ఏళ్ల క్రితం కాలభైరవ అనే ఒక యోధుడి పాత్రలో అందుతంగా నటించాడు. అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు రాలేదు. 100 మందిని చంపుతున్నప్పుడు ఒక్కో ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ ఎమోషన్ ను రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ మీద అతను కనిపించిన విధానం ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు... ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు...
నటనలో నెక్స్ట్ లెవల్...
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా తనలోని పరిపూర్ణ నటుడిని బయటికి తీసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అప్పటి వరకు రామ్ చరణ్ సినిమా చేయలేదు. తనకు విలేజ్ తో పెద్దగా సంబంధం లేదు. అయినప్పటికి గ్రామాల్లో ఉండే ప్రజలు ఎలా మాట్లాడతారు. ఒక చెవిటి వ్యక్తి ఎలాంటి హావభావాలను పనికిస్తాడు. మాటలు వినిపించని వ్యక్తి పడే ఇబ్బందులు ఏంటి? వీటన్నింటిని స్క్రీన్ మీద చాలా అలవోకగా చెస్ మెప్పించాడు. ఈ సినిమాతో నటుడిగా చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు రామ్ చరణ్ ను పూర్తి స్థాయిలో దగ్గర చేసింది.
రామ్ చరణ్ కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోని స్టార్ డైరెక్టర్లందరు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం చాలా సెలెక్టెడ్ గా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సుకుమార్ తర్వాత సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి...
