Begin typing your search above and press return to search.

లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో రామ్ చ‌ర‌ణ్ బాడీగార్డ్ అష్ట‌క‌ష్టాలు!

టాలీవుడ్ అగ్ర హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ మరోసారి ప్రూవైంది.

By:  Sivaji Kontham   |   28 Jun 2026 10:02 PM IST
లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో రామ్ చ‌ర‌ణ్ బాడీగార్డ్ అష్ట‌క‌ష్టాలు!
X

టాలీవుడ్ అగ్ర హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ మరోసారి ప్రూవైంది. చ‌ర‌ణ్ పెద్ది స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ స‌రిహ‌ద్దులు దాటాయి. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, స్థానిక అభిమానుల నుండి ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. రామ్ చరణ్‌ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలనే ఆరాటంతో వందలాది మంది అభిమానులు అక్కడకు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక‌ల‌లో జోరుగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

రామ్ చరణ్ నటించిన తాజా స్పోర్ట్స్ డ్రామా చిత్రం `పెద్ది` బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో లండన్‌లోని అభిమానులు ఈ సక్సెస్‌ను చరణ్‌తో కలిసి ఘనంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. లండన్ వీధుల్లో అభిమానులు చూపించిన ఉత్సాహం, చప్పట్లు, కురిపించిన అమితమైన ప్రేమను చూస్తుంటే గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ మార్కెట్ ఎంతగా విస్తరించిందో స్పష్టమవుతోంది. గతంలో వచ్చిన `గేమ్ ఛేంజర్` చిత్రం ఆశించిన స్థాయిలో ఆడ‌కపోయినా, పెద్ది సినిమా సాధించిన విజయంతో చరణ్ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటారని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

అయితే లండ‌న్ ఫ్యాన్ మీట్ లో చ‌ర‌ణ్ చుట్టూ చేరిన అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌డానికి త‌న బాడీగార్డ్ కెవిన్ ఎంత‌గా శ్ర‌మించాల్సొచ్చిందో కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం. ఫ్యాన్స్ అత్యుత్సాహంగా మీదికి దూసుకొస్తూ సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ‌టంతో అత‌డు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఓవైపు ఫ్యాన్స్ మ‌న‌సు గాయ‌ప‌డ‌కుండా స‌న్నివేశాన్ని డీల్ చేయాల్సి రావ‌డంతో కెవిన్ కూడా కొంత జాగ్ర‌త్త‌గానే ఉన్నాడు.ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి.

రామ్ చరణ్ లండన్ పర్యటన అనగానే గత ఏడాది అత‌డి లైఫ్‌లో ప్ర‌త్యేక‌మైన సెల‌బ్రేష‌న్ అందరికీ గుర్తుకు వస్తుంది. లండన్‌లోని `మేడమ్ టుస్సాడ్స్` మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆనాడు తన భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారా, తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి- సురేఖల సమక్షంలో రామ్ చరణ్ స్వయంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆనాటి ఎమోష‌న‌ల్ ఘ‌ట్టానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చినా లాంగ్ రన్‌లో ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 149 కోట్ల భారీ షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడు -కేరళలలో కలిపి 2.40 కోట్లు, అలాగే ఉత్తరాది (హిందీ బెల్ట్) లో 12 కోట్ల వరకు రాబట్టింది. వీటికి తోడు విదేశీ (ఓవర్సీస్) మార్కెట్ల నుండి కూడా దాదాపు 23 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పెద్ది చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌ట‌న‌కు ప్ర‌త్యేకించి ప్ర‌శంస‌లు ద‌క్క‌డాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.