Begin typing your search above and press return to search.

RRR వచ్చి నాలుగేళ్లు.. కానీ ఫ్రెండ్‌ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!

RRRలో చరణ్‌, తారక్‌ పాత్రల మధ్య ఉన్న ఎమోషన్, ఫ్రెండ్ షిప్, యాక్షన్‌ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

By:  M Prashanth   |   6 Sept 2026 10:00 PM IST
RRR వచ్చి నాలుగేళ్లు.. కానీ ఫ్రెండ్‌ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!
X

సినిమా విడుదలై కొన్నేళ్లు గడిచినా.. కొన్ని కాంబినేషన్లపై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం అస్సలు తగ్గదు. అలాంటి కాంబోనే టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRRతో ఇద్దరూ కలిసి చేసిన సందడి ఎప్పటికీ అభిమానులకు గుర్తుంటుంది. స్క్రీన్ పై రామ్‌, భీమ్‌ గా వీరిద్దరి ఫ్రెండ్ షిప్ ఎంతగా ఆకట్టుకుందో.. ఆ ఎఫెక్ట్ సినిమా దాటి హీరోల కాంబినేషన్‌ పైనా కనిపిస్తోంది.

RRR విడుదలై దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. చరణ్‌, తారక్‌ మళ్లీ కలిసి కనిపిస్తే ఎలా ఉంటుందనే చర్చ తరచూ తెరపైకి వస్తోంది. సోషల్‌ మీడియాలో వీరిద్దరి పాత వీడియోలు, సినిమా క్లిప్పులు వైరల్‌ అవుతుండటం కూడా ఆ క్రేజ్‌ కు ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలోని ఇద్దరి ఫ్రెండ్ షిప్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ కావడంతో.. ఇప్పుడు హీరోల రీయూనియన్‌ అంటేనే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది.

సాధారణంగా ఒక సినిమాకు కథ, దర్శకుడు, స్టార్‌ క్యాస్టింగ్ కీలకం. కానీ RRR’ విషయంలో చరణ్‌-తారక్‌ కాంబో కూడా ఒక స్పెషల్ బ్రాండ్‌ గా మారిపోయింది. అందుకే ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తే కథ ఎలా ఉంటుంది? ఏ దర్శకుడు తెరకెక్కిస్తారు? అనే ప్రశ్నల కంటే ముందు.. అసలు వీరిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌ లో కనిపిస్తే చాలు అని అభిమానులు భావిస్తున్నారు.

RRRలో చరణ్‌, తారక్‌ పాత్రల మధ్య ఉన్న ఎమోషన్, ఫ్రెండ్ షిప్, యాక్షన్‌ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి చేసే సీన్స్ థియేటర్లలో అభిమానులకు మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చాయి. అదే ఇప్పుడు మరోసారి ఆ కాంబోపై అంచనాలను పెంచుతోంది. RRR లాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తుందా? వస్తే కథ ఏంటి? అనే చర్చలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే అభిమానుల ఆసక్తిని గమనిస్తే.. సీక్వెల్‌ కథ కంటే చరణ్‌, తారక్‌ రీయూనియన్‌ పైనే ఎక్కువ ఫోకస్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరి కాంబినేషన్‌ మరోసారి స్క్రీన్ పైకి వస్తే భారీ స్థాయిలో క్రేజ్‌ రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం చరణ్‌, తారక్‌ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టు వారణాసిపై కంప్లీట్ ఫోకస్ పెట్టారు.

దీంతో చరణ్‌- తారక్‌ కాంబినేషన్‌ పై వస్తున్న ప్రతి చిన్న చర్చ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఏదేమైనా ‘RRR మ్యూనియా ఫుల్ గా తగ్గినా. రామ్‌, భీమ్‌ ల ఫ్రెండ్ షిప్ మాత్రం ప్రేక్షకుల మెమోరీస్ నుంచి చెరిగిపోలేదు. అదే ఇప్పుడు చరణ్‌, తారక్‌ కలిసి చేసే మరో సినిమా కోసం వెయిటింగ్ గా మారింది. అందుకే RRR వచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఆ ఫ్రెండ్‌ షిప్‌ మేనియా మాత్రం తగ్గలేదనే చెప్పాలి.