రామ్ చరణ్ ఫిట్‌నెస్ రహస్యం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన నటుడే కాదు. కఠినమైన ఫిట్‌నెస్ .. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
By: Srikanth Kontham | 25 Aug 2026 9:00 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన నటుడే కాదు. కఠినమైన ఫిట్‌నెస్ .. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు. పాత్రల డిమాండ్‌కు తగినట్లుగా శరీరాన్ని మలచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా రామ్ చరణ్ ఫిట్‌నెస్ రొటీన్, ఆయన రోజువారీ దినచర్యకు సంబంధిం చిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయాన్నే చేసే వ్యాయామాలు, కఠినమైన షెడ్యూల్ అయన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుతాయని తెలుస్తోంది.
ఫిట్‌నెస్ పట్ల రామ్ చరణ్ నిబద్ధత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. గతంలోనూ చరణ్ జిమ్ సెషన్స్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. `స్ట్రాంగ్ మార్నింగ్స్.. ఉదయాన్నే వ్యాయామంతో రోజును ప్రారంభించడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదు` అని ఓ సందర్భంలో పేర్కొన్నారు. కఠినమైన వర్కవుట్లు, కండలు తిరిగిన దేహంతో చరణ్ ఫిట్‌నెస్ గోల్స్‌ను క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. ముఖ్యంగా భారీ యాక్షన్ చిత్రాలు, శారీరక శ్రమతో కూడిన పాత్రల కోసం చరణ్ జిమ్‌లో చెమటోడ్చుతుంటారు.
అయితే రామ్ చరణ్ విజయానికి కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆయన పాటిస్తున్న కఠినమైన డైలీ షెడ్యూల్ కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన దినచర్య గురించి వివరించారు ఉదయం 5 గంటలకు లేవడం, ఉదయం 7 గంటలకల్లా షూటింగ్ లొకేషన్‌కు చేరుకోవడం, 7:30 కల్లా మొదటి షాట్ ఇవ్వడం తన దినచర్యలో భాగమని తెలిపారు. షూటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడపడం, ఆపై జిమ్‌కు వెళ్లడం చరణ్ దినచర్యగా ఉంటుందని వెల్లడించారు.
చాలా మందికి రొటీన్ గా ఇది విసుగు తెప్పించినా? క్రమశిక్షణాబద్ధమైన జీవనశైలియే తనకు అసలైన విజయాలను తెచ్చిపెడుతుందని రామ్ చరణ్ నమ్ముతారు. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి, ఉత్తమ నటనను అందించడానికి నిరంతరం కష్టపడటం ఎంతో అవసరమని చరణ్ భావిస్తారు. ఉదయం పూట వ్యాయామం, కఠినమైన సమయపాలన ఆయన్ని నిత్యం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతున్నాయి.
ఇటీవల స్పోర్ట్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన `పెద్ది` చిత్రంలో రామ్ చరణ్ లుక్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. కడలు తిరిగిన దేహంతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ప్రత్యేకంగా శారీరక పరివర్తన చెందాల్సి వచ్చింది. ఇలాంటి భారీ చిత్రాలు, విభిన్న పాత్రలు చేయాలంటే నటులకు అంకితభావంతో కూడిన ఫిట్‌నెస్ ముఖ్యం. రామ్ చరణ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను సమన్వయం చేసుకుంటూ ఫిట్‌నెస్‌కు కూడా సమయం కేటాయించడం నవ తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
