విక్టోరియా హార్బర్‌లో చరణ్ ఫొటోషూట్… ఫ్యాన్స్ ఫిదా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. హాంకాంగ్‌లోని ప్రఖ్యాత విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఫోటోషూట్‌లో చరణ్ మెరిసిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
By: Madhu Reddy | 14 April 2026 8:36 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. హాంకాంగ్‌లోని ప్రఖ్యాత విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఫోటోషూట్‌లో చరణ్ మెరిసిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ కవర్ పేజీ కోసం ఆయన చేసిన ఈ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వైట్ అండ్ వైట్ సూటులో క్లాసీగా కనిపిస్తూ చెర్రీ తన గ్లోబల్ ఇమేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు.
హాంకాంగ్ వీధుల్లో రాయల్ లుక్:
మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌గా మారిపోయారు. హాంకాంగ్ స్కైలైన్ నేపథ్యంలో విక్టోరియా హార్బర్‌లో ఒక ఓడపై నిల్చున్న చెర్రీ ఫోటోలు అత్యంత రాయల్‌గా ఉన్నాయి. ఇక వైట్ అండ్ వైట్ సూటులో ఆయన చూపిస్తున్న గ్రేస్, ఆ క్లాసీ లుక్ మేగజైన్ కవర్ పేజీకే కొత్త అందాన్ని తెచ్చాయి. చరణ్ స్టైల్ చూస్తుంటే మగధీర గాంభీర్యం, గ్లోబల్ స్టార్ ఇమేజ్ రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మ్యాగజైన్ కవర్ స్టోరీ.. వైరల్ పిక్స్:
ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ ఫోటోలను పంచుకోగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. వైట్ సూట్‌తో పాటు, బ్రౌన్ కలర్ సూటులో ఉన్న మరికొన్ని స్టైలిష్ చిత్రాలను కూడా ఫ్యాన్స్ కోసం విడుదల చేశారు. హాంకాంగ్ అందాల మధ్య రామ్ చరణ్ గ్రేస్ చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #రామ్ చరణ్, #ఎస్క్వైర్ ఇండియా వంటి హ్యాష్ ట్యాగ్‌లు ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉండటం చరణ్ క్రేజ్‌కు నిదర్శనం.
బుచ్చిబాబు సినిమాపై భారీ అంచనాలు:
ఒకవైపు ఫోటోషూట్లతో అదరగొడుతూనే, మరోవైపు సినిమాలతో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన చికిరీ, రై రై రార సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక లక్షల్లో రీల్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ సాంగ్ ఇండియాలోనే ఒక పెద్ద సెన్సేషన్‌గా మారింది. బుచ్చి మామ చరణ్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో అని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు.
'RRR' తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ ఆస్కార్ స్థాయికి చేరుకోవడంతో, ఆయన చేసే ప్రతి చిన్న పని కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇలాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లపై మెరవడం ద్వారా చరణ్ తన గ్లోబల్ బ్రాండ్‌ను మరింత పటిష్టం చేసుకుంటున్నారు. మున్ముందు చరణ్ నుంచి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ రాబోతున్నాయని అర్థమవుతోంది. ఇలాగే చెర్రీ తన విజయయాత్రను కొనసాగించాలని ఆశిద్దాం.
