మెగా నామకరణ వేడుక.. చరణ్ కవలల పేర్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. చరణ్ ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 12 Feb 2026 11:33 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. చరణ్ ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుండి మెగా వారసుల పేర్లు ఏమై ఉంటాయా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. ఎట్టకేలకు నిన్న జరిగిన సాంప్రదాయ నామకరణ వేడుకతో ఈ సస్పెన్స్‌కు తెరపడింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ ఫంక్షన్ విషయాలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లలకు కాస్త వెరైటీగా ఉండే పేర్లు పెట్టాలని చూస్తుంటారు. కానీ చరణ్ దంపతులు మాత్రం మన సంస్కృతికి, ఫ్యామిలీ లెగసీకి ప్రాధాన్యత ఇస్తూ పేర్లను ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ పేర్ల వెనుక ఒక లోతైన అర్థం ఉండటమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. ఉపాసన ఈసారి మదర్‌హుడ్‌ను చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు తన మాటల్లో అర్థమవుతోంది.
ఇక చరణ్ తన కొడుకుకు శివరామ్, కూతురికి అన్వీర దేవి అని నామకరణం చేశారు. కొడుకు పేరులో శివుడు, రాముడు ఇద్దరి శక్తులు కలవడమే కాకుండా, చిరంజీవి అసలు పేరు అయిన ‘శివ శంకర్ వరప్రసాద్’ లోని మొదటి పదాన్ని తీసుకోవడం విశేషం. ఇక కూతురు పేరు ‘అన్వీర దేవి’. చిరంజీవి తల్లి పేరు అంజనా దేవి కావడంతో ఇలా కూడా చరణ్ నానమ్మ పేరును కూతురికి పెట్టుకోవడం విశేషం.
రెండోసారి తల్లి కావడంపై ఉపాసన తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. మొదటిసారి క్లారా పుట్టినప్పుడు అంతా కొత్తగా, కొంచెం కన్ఫ్యూజింగ్‌గా అనిపించినా, ఈసారి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు చెప్పారు. కవల పిల్లలను చూసుకోవడం ఒక మ్యాజిక్ లాంటిదని, క్లారాతో చరణ్ చాలా క్లోజ్ గా ఉంటూ తనకు హెల్ప్ చేస్తున్నారని ఆమె మురిసిపోయారు. ముగ్గురు పిల్లలు కలిసి ఉన్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరని ఉపాసన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
డెలివరీ వరకు కూడా ఉపాసన తన పనుల్లో బిజీగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం తన హాస్పిటల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నానని, లైఫ్ లో వర్క్ కి, ఫ్యామిలీ కి బ్యాలెన్స్ చాలా ముఖ్యమని ఆమె చెబుతున్నారు. క్లారా పుట్టిన గదిలోనే ఈ కవలలు కూడా జన్మించడం ఒక స్పెషల్ సెంటిమెంట్ అని చెబుతున్నారు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి తిథి, నక్షత్రం చూసుకునే ఈ బర్త్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి శివరామ్, అన్వీర దేవిల ఎంట్రీతో మెగా ఫ్యామిలీలో జోష్ మామూలుగా లేదు. ఈ పేర్లు విన్న మెగా ఫ్యాన్స్ చరణ్ టేస్ట్ సూపర్ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.
