Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ లో ఆ యాంగిల్ కూడానా?

ఈ సాంగ్ లో చ‌ర‌ణ్ కూర్చుని చేసే స్పెష‌ల్ స్టెప్ తో పాటూ, బ్యాట్ పట్టుకుని చేసే స్టెప్ విప‌రీతంగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Feb 2026 11:56 AM IST
చ‌ర‌ణ్ లో ఆ యాంగిల్ కూడానా?
X

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు జగపతి బాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.

వైర‌ల్ అవుతున్న పెద్ది హుక్ స్టెప్

పెద్ది సినిమా నుంచి ఇప్ప‌టికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఫ‌స్ట్ సింగిల్ గా వ‌చ్చిన చికిరి సాంగ్ కు మరింత రెస్పాన్స్ వ‌చ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట మిలియన్లలో వ్యూస్ సాధించడం విశేషం. ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్‌స్టా, యూట్యూబ్ లో ఈ హుక్ స్టెప్ పై ఎన్నో రీల్స్ కూడా వ‌చ్చాయంటే ఆ సాంగ్ ఎంత ఫేమ‌స్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

చ‌ర‌ణ్ రియాక్ష‌న్ పై జానీ కామెంట్స్

ఈ సాంగ్ లో చ‌ర‌ణ్ కూర్చుని చేసే స్పెష‌ల్ స్టెప్ తో పాటూ, బ్యాట్ పట్టుకుని చేసే స్టెప్ విప‌రీతంగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా ఓ డ్యాన్స్ షో లో చికిరి సాంగ్ ను కొరియోగ్ర‌ఫీ చేసిన జానీ మాస్ట‌ర్ ఈ సాంగ్ గురించి మాట్లాడారు. చికిరి సాంగ్ హుక్ స్టెప్ కంపోజ్ చేసి చూపించిన‌ప్పుడు చ‌ర‌ణ్ ఎలా రియాక్ట్ అయ్యార‌ని అడగ్గా, దానికి జానీ మాస్ట‌ర్ చెప్పిన ఆన్స‌ర్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రించింది.

ఆ స్టెప్ చ‌ర‌ణ్ కంపోజ్ చేసిందే!

చికిరి సాంగ్ లో నిల్చుని వేసే స్టెప్ తో పాటూ, బ్యాట్ ప‌ట్టుకుని చేసే స్టెప్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఆలోచించి రూపొందించార‌ని, పాట‌లో కూర్చుని వేసే హుక్ స్టెప్ ను మాత్రమే తాను డిజైన్ చేశాన‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా షాకయ్యారు. ఆ డ్యాన్స్ షో లో జానీ మాస్ట‌ర్ తో పాటూ నిహారిక కూడా ఓ జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఆమె కూడా ఈ విష‌యం విని వావ్ అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు.

సాంగ్ ను కొరియోగ్ర‌ఫీ చేసిన జానీ మాస్ట‌ర్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న‌టుడిగా మాత్ర‌మే కాకుండా ఇలా కొరియోగ్రఫీ విష‌యంలో కూడా చ‌ర‌ణ్ టాలెంట్ చూపించ‌డం మ‌రింత స్పెష‌ల్ గా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ, చ‌ర‌ణ్ త‌ను న‌టించే ప్ర‌తీ సినిమాలోనూ ప్ర‌తీ సీన్ ను కొత్త‌గా చూపించాల‌ని ప్ర‌య‌త్నించ‌డం చ‌ర‌ణ్ స్పెషాలిటీ అని సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ప్ర‌శంసిస్తున్నారు.