చరణ్ చికిరి.. అదే 'హైలెట్'
ఇంటర్నెట్ అంతా ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ తో మార్మోగిపోతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నుంచి నిన్న మేకర్స్ తొలి సింగిల్ చికిరి చికిరి రిలీజ్ చేశారు.
By: M Prashanth | 8 Nov 2025 5:29 PM ISTఇంటర్నెట్ అంతా ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ తో మార్మోగిపోతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నుంచి నిన్న మేకర్స్ తొలి సింగిల్ చికిరి చికిరి రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన నుంచి అందరి నోళ్లల్లో ఈ పాట నానుతుంది. క్యాచీ గా ఉన్న ఈ పదాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ హుక్ గా పెట్టి అద్భుతంగా కంపోజ్ చేశారు. తెలుగులోనే కాదు, మిగతా భాషల్లోనూ ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే పాట హిట్ అవ్వడానికి లిరిక్స్ ఒకెత్తైతే.. రామ్ చరణ్ గ్రేస్ ఇందుకు మరో కారణం. ఆయన మేనరిజం, డ్యాన్స్ స్టెప్పులు, స్క్రీన్ ప్రజెన్స్ ఇవన్నీ పాటను హైలైట్ గా నిలిపాయి. చెర్రీ క్యాజువల్ ఔట్ ఫిట్, రగ్గ్ డ్ గడ్డం, స్టైలిష్ హెయిర్, రూరల్ బ్యాక్ డ్రాప్ యువకుడిగాలా చూపించడంలో టెక్నిషియన్లు సక్సెస్ అయ్యారు. ఇవన్నీ పాటకు ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే చికిరి అనేది పల్లెటూర్లలో అమ్మాయిలను ముద్దుగా పిలిచేందుకు వాడే పదం అని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు.
అందుకే అన్ని భాషల్లో ఈ పాటకు చికిరి అనే టైటిల్ ఉంచారు. దీంతో అన్ని భాషల ప్రేక్షకులకు ఈ పదం నేటివిటీలాగా అనిపించింది. దీనికి తోడు హీరోయిన్ జాన్వీ కపూర్ కు ఎక్స్ పోజింగా కాకుండా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో చూపించారు. అలా లిరిక్స్, మ్యూజిక్, రామ్ చరణ్ డ్యాన్స్, సినిమాటోగ్రఫీ, కంపోజింగ్ ఇలా అన్ని కలిపి పాటను అత్యుత్తంగా నిలిపాయి. అందుకే తెలుగుతోపాటు అన్ని భాషల్లో పాట లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతోంది.
ముఖ్యంగా చెర్రీ డ్యాన్స్ కు పాన్ఇండియా లెవెల్ లో ప్రశంసలు అందుతున్నాయి. తన గత చిత్రం గేమ్ ఛేంజర్ లో ఇలాంటి స్టెప్పులు లేకపోవడంతో అప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ చరణ్ వింటేజ్ డ్యాన్స్ చూడనున్నామని ఉత్సాహంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లోనూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈపాట చాట్ బస్టర్ గా నిలవడం పక్కా!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ తో చకచకా చిత్రీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హిందీ నటుడు దివ్యేందు కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
