Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు స్ట్రాటజీకి చరణ్ డెడికేషన్ తోడైతే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌ లో రూపొందుతున్న పెద్ది చిత్రంపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి

By:  M Prashanth   |   25 April 2026 5:03 PM IST
బుచ్చిబాబు స్ట్రాటజీకి చరణ్ డెడికేషన్ తోడైతే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌ లో రూపొందుతున్న పెద్ది చిత్రంపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒకటే.. 'బుచ్చిబాబు స్ట్రాటజీకి చరణ్ డెడికేషన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ అవ్వడం ఖాయం' అన్నదే.

నిజానికి ఉప్పెనతోనే వంద కోట్ల క్లబ్‌ లో చేరిన బుచ్చిబాబుకు ఇది రెండో చిత్రం. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అవకాశం రావడం విశేషం. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కొన్నేళ్ల పాటు నిర్మాణ దశలో ఉండటం చూస్తుంటాం.

అయితే పెద్ది మాత్రం దాదాపు ఏడాది కాలంలోనే షూటింగ్ పూర్తి దశకు చేరుకోవడం విశేషం. చిత్రీకరణ లాస్ట్ లో ఉన్నప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. రెండు సార్లు విడుదల వాయిదా పడినా, సినిమాపై ఎలాంటి నెగిటివ్ టాక్ రాకుండా దర్శకుడు ప్లానింగ్ మాత్రం సూపర్. ఈ క్రమంలో ఆయన స్ట్రాటజీ క్లియర్ గా కనిపిస్తోంది.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, గత చిత్రం గేమ్ ఛేంజర్ నిరాశపరిచిన నేపథ్యంలో పెద్దితో గట్టి కమ్‌ బ్యాక్ ఇవ్వాలనే ప్లాన్ తో ఉన్నారు. అందుకే ఆయన కంప్లీట్ డెడికేషన్ తో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త లుక్, విభిన్న గెటప్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి కష్టపడుతున్నారు. అంతేకాకుండా, ఇతర ప్రాజెక్టులను పక్కనపెట్టి పెద్దిపైనే దృష్టి పెట్టడం ఆయన డెడికేషన్‌ ను చూపిస్తోంది.

1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దిలో రామ్ చరణ్ పహిల్వాన్ పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన జాన్వీ కపూర్ అచియమ్మగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ క్రీడ కుస్తీ చుట్టూ తిరిగే కథలో ఎమోషన్స్, విలేజ్ పాలిటిక్స్ ప్రధానంగా ఉండనున్నాయి.

రామ్ చరణ్ తన పాత్ర కోసం ఉత్తరాంధ్ర యాసను ప్రత్యేకంగా నేర్చుకోవడం విశేషం. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ తో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ అసెట్స్. మొదట ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించిన ఆ చిత్రం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, బుచ్చిబాబు స్ట్రాటజీకి రామ్ చరణ్ డెడికేషన్ కలిసొస్తే పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి.