Begin typing your search above and press return to search.

కలెక్షన్లే ముఖ్యమా? చరణ్ అభిప్రాయమేంటి?

ఈ నేపథ్యంలో తాజాగా బాక్సాఫీస్‌ నెంబర్ల ఇంపార్టెన్స్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

By:  M Prashanth   |   29 May 2026 2:51 PM IST
కలెక్షన్లే ముఖ్యమా? చరణ్ అభిప్రాయమేంటి?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిపై రిలీజ్ కు సిద్ధమవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రంతో మరోసారి తన యాక్టింగ్ లో కొత్త యాంగిల్ ను చూపించేందుకు చరణ్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాక్సాఫీస్‌ నెంబర్ల ఇంపార్టెన్స్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కలెక్షన్లు ఒక నటుడి కెరీర్‌ లో కీలక పాత్ర పోషిస్తాయని ఒప్పుకున్న చరణ్.. అవే సక్సెస్ కు ఏకైక మెజర్మెంట్ కాదని స్పష్టం చేశారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలో మాట్లాడిన చరణ్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పూర్తిగా బాక్సాఫీస్‌ నంబర్ల చుట్టూనే తిరుగుతోందని తెలిపారు. ఒక సినిమా ఎంత వసూలు చేసింది? తొలి రోజు ఎంత కలెక్షన్ సాధించింది? ఓపెనింగ్‌ రికార్డులు ఎలా ఉన్నాయి? వంటి అంశాలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. అయితే సినిమా విజయాన్ని కేవలం నెంబర్స్ తో మాత్రమే మెజర్ చేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"మంచి బాక్సాఫీస్‌ నంబర్లు వచ్చినప్పుడు నెక్స్ట్ సినిమాల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నిర్మాతలు కూడా కొత్త కథలకు, కొత్త తరహా పాత్రలకు ముందుకు వస్తారు. అందుకే కలెక్షన్లు ముఖ్యమే. కానీ అవే మొత్తం కాదు" అంటూ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కలెక్షన్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న వేళ ఆయన కామెంట్స్.. ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలకు తొలిరోజు వసూళ్లు కీలకంగా మారాయి. స్టార్ హీరోల సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్‌, ఓటీటీ హక్కులు, ఓపెనింగ్ డే రికార్డులు వంటి అంశాలు ముందుగానే నెట్టింట హాట్ టాపిక్‌ గా మారుతున్నాయి. దీంతో కథ, కంటెంట్‌, యాక్టింగ్ కంటే నెంబర్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే చరణ్ కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

సినిమా హిట్ అవ్వడం ద్వారా నటుడికి వచ్చే లాభం కేవలం మార్కెట్ పెరగడమే కాదు.. కొత్త తరహా కథలు ఎంచుకునే ధైర్యం కూడా వస్తుందని చరణ్ కామెంట్స్ లో క్లియర్ గా తెలుస్తోంది. ఒకవేళ వరుస విజయాలు ఉంటే దర్శకులు, నిర్మాతలు కూడా రిస్క్ తీసేందుకు సిద్ధమవుతారని, దాంతో విభిన్న కథలకు అవకాశం లభిస్తుందన్నది ఆయన ఫీలింగ్. ఇది ఒక నటుడి కెరీర్‌ గ్రోత్ కు కూడా ఉపయోగపడుతుందని చెప్పాలి.

మరోవైపు ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు కంటెంట్‌ పై అవగాహన పెరిగింది. మంచి కథ ఉంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ వచ్చిన ప్రతి సినిమా క్లీన్ హిట్ సాధించకపోవచ్చు. అదే విధంగా స్లోగా స్టార్ట్ అయిన కొన్ని సినిమాలు తర్వాత భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ నెంబర్స్ తో పాటు ప్రేక్షకుల రెస్పాన్స్ ముఖ్యమనే ఫీలింగ్ గట్టిగా వినిపిస్తోంది. ఏదేమైనా బాక్సాఫీస్‌ వసూళ్లు అవసరమే అయినప్పటికీ.. అవే విజయానికి మెజర్మెంట్ కాదన్న చరణ్ వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.