Begin typing your search above and press return to search.

హీరోను మించి ఫేమస్ అయిన బాడీగార్డ్.. ఇప్పుడు మరో స్టార్‌తో!

పెద్ది సినిమా టైమ్ లో రామ్ చరణ్‌తో దాదాపు ప్రతిచోటా కనిపిస్తూ కెవిన్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2026 3:00 PM IST
హీరోను మించి ఫేమస్ అయిన బాడీగార్డ్.. ఇప్పుడు మరో స్టార్‌తో!
X

సినిమా హీరోల చుట్టూ కనిపించే బాడీగార్డులు సాధారణంగా తెరవెనుకే ఉంటారు. కానీ ఒక్కోసారి వారి పర్సనాలిటీ, హీరోతో కనిపించే విధానం, సోషల్ మీడియాలో వైరలయ్యే వీడియోల కారణంగా వాళ్లకూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అలాంటి గుర్తింపే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాడీగార్డ్ కెవిన్ కుంటాకు దక్కింది. పెద్ది సినిమా టైమ్ లో రామ్ చరణ్‌తో దాదాపు ప్రతిచోటా కనిపిస్తూ కెవిన్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫేమస్ బాడీగార్డ్ తన కొత్త డ్యూటీతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.

కెవిన్ కుంటా గతంలో రామ్ చరణ్ బాడీగార్డ్‌గా పనిచేయగా, ప్రస్తుతం ఆయన చరణ్‌తో కలిసి పనిచేయడం లేదని, అక్కినేని నాగార్జునతో కలిసి పనిచేస్తున్నట్టు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. దీంతో మెగా క్యాంప్ నుంచి అక్కినేని క్యాంప్‌కు కెవిన్ షిఫ్ట్ అయ్యాడా? అనే డిస్క‌ష‌న్ మొదలైంది. అయితే ఈ మార్పుకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది.

పెద్ది సినిమా టైమ్ లో ప్ర‌తీ ఈవెంట్‌కు చ‌ర‌ణ్ వెంటే ఉంటూ అత‌న్ని నిత్యం కాపాడిన కెవిన్ ఇప్పుడు అక్కినేని క్యాంప్ కు వెళ్తున్నార‌నే వార్త నెట్టింట చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో పెద్ది ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్ స్వయంగా కెవిన్ గురించి సరదాగా మాట్లాడుతూ, తనకంటే తన బాడీగార్డుకే ఎక్కువ ఫేమ్ వచ్చిందంటూ కామెంట్ చేశారు. అప్పట్లో సరదాగా చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే చరణ్‌తో కలిసి పనిచేసిన సమయంలో వచ్చిన గుర్తింపు కెవిన్‌కు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

ఇప్పుడ‌దే కెవిన్ నాగార్జునతో కనిపించనున్నార‌నే వార్త ఆసక్తిని మరింత పెంచుతోంది. ఒక మెగా హీరోతో ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు అక్కినేని స్టార్‌తో కొత్త జర్నీ మొదలుపెట్టడం ఇండస్ట్రీలోనూ ఆసక్తికర పరిణామంగానే మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతికి గాయం కావడంతో విశ్రాంతిలో ఉన్నారు. కోలుకున్న తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయనున్న విష‌యం తెలిసిందే. మరోవైపు నాగార్జున తన మైల్‌స్టోన్ ఫిల్మ్ కింగ్100తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కెవిన్ కొత్త డ్యూటీపై వస్తున్న వార్తలు నిజమే అయితే.. మెగా క్యాంప్ నుంచి అక్కినేని క్యాంప్‌కు జరిగిన ఈ షిఫ్ట్ ఆయన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన మలుపుగా చెప్పుకోవచ్చు.