Begin typing your search above and press return to search.

'పెద్ది' బెజ‌వాడ ఈవెంట్: MMA ఫైట‌ర్‌లా ఎంట్రీ ఇర‌గ‌దీశాడ‌య్యా!

రామ్ చ‌ర‌ణ్ ఎంఎంఏ ఫైట‌ర్ ని త‌న‌కు ర‌క్ష‌కుడిగా పెట్టుకోవ‌డ‌మే కాదు... అత‌డి నుంచి ట్రైనింగ్ తీసుకుని సినిమాలో కుస్తీలు కూడా ప‌ట్టాడు.

By:  Sivaji Kontham   |   1 Jun 2026 11:10 PM IST
పెద్ది బెజ‌వాడ ఈవెంట్: MMA ఫైట‌ర్‌లా ఎంట్రీ ఇర‌గ‌దీశాడ‌య్యా!
X

రామ్ చ‌ర‌ణ్ ఎంఎంఏ ఫైట‌ర్ ని త‌న‌కు ర‌క్ష‌కుడిగా పెట్టుకోవ‌డ‌మే కాదు... అత‌డి నుంచి ట్రైనింగ్ తీసుకుని సినిమాలో కుస్తీలు కూడా ప‌ట్టాడు. బాక్సింగ్ చేసాడు.. ఇప్పుడు అత‌డు ప‌ర్ఫెక్ట్ మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్ గా మారాడు. చెయ్యి ఇరిగినా కానీ రోషం పౌరుషం మగ‌ధీర‌లో త‌గ్గ‌లేదు. అత‌డు భారీ ఈవెంట్ల‌కు వ‌స్తుంటే ఎంఎంఏ ఫైట‌ర్ వ‌చ్చిన‌ట్టే ఉంద‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చ‌ర‌ణ్ బాడీ లాంగ్వేజ్ గ‌మ‌నిస్తే అత‌డు ఒక ఫైట‌ర్ లా క‌నిపిస్తున్నాడు. ఎంఎంఏ ఫైట‌ర్ కెవిన్ ఏ రేంజులో త‌ర్ఫీదునిచ్చాడో కానీ చ‌ర‌ణ్ ఈ రోజు బెజ‌వాడ‌లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన‌ప్పుడు ఒక ఎంఎంఏ ఫైట‌ర్ రేంజులో ఎంట్రీ ఇచ్చిన విజువ‌ల్స్ ఇప్పుడు వెబ్ లో పోటెత్తుతున్నాయి. చ‌ర‌ణ్ మేకోవ‌ర్ బాడీ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ మాత్ర‌మే కాదు బాడీ లాంగ్వేజ్ కూడా అమాంతం మారిపోయింది. చూస్తుంటే సినిమాలో ఫైట్స్ ఇర‌గ‌దీశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ మార్పులను గమనిస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు -ఫైట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయోనని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పెద్ది భారీ రిలీజ్ ముందు ఇరు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధ‌ర‌లు కూడా పెరిగాయి. అంతా స‌జావుగా రిలీజ‌వుతోంది. ఇక ఇదే హుషారులో ఈ సినిమా భారీ ఓపెనింగుల‌తో రికార్డులు సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం మెగా అభిమానుల ఉత్సాహానికి అడ్డులేకుండా అంతా సజావుగా సాగుతోంది. చరణ్ ఫైటర్ లా ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ వెబ్‌లో వైరల్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంద‌ని అభిమానులు జోష్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

పెద్ది ఈవెంట్లో చ‌ర‌ణ్ తో పాటు బుచ్చిబాబు, జాన్వీక‌పూర్ , జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు సందడి చేస్తున్నారు. యాంక‌ర్ సుమా ఈవెంట్ లో జోష్ పెంచుతూ అద్భుత వ్యాఖ్యానంతో అల‌రిస్తున్నారు.