లాంగ్ గ్యాప్ తర్వాత.. చరణ్, బన్నీ ఇలా..
అయితే ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. కారణాలేంటనేవి పక్కన పెడితే.. చరణ్, బన్నీ ఓ చోట కనపడకపోవడం మాత్రం నిజమే.
By: M Prashanth | 30 Aug 2025 2:50 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇద్దరూ అగ్ర కథానాయకులుగా ఎదిగారు. సినీ వారసత్వం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను చరణ్, బన్నీ దక్కించుకున్నారు.
అయితే ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. కారణాలేంటనేవి పక్కన పెడితే.. చరణ్, బన్నీ ఓ చోట కనపడకపోవడం మాత్రం నిజమే. చరణ్, బన్నీ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారని రకరకాల ఊహాగానాలు నెట్టింట ఆ మధ్య చక్కర్లు కొట్టాయి.
కానీ వాటిపై ఇప్పటివరకు చరణ్, బన్నీ ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా ఇద్దరూ కలిసి కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ శనివారం ఉదయం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
తన నాయనమ్మ మరణవార్త తెలియగానే ముంబైలో అట్లీ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్.. అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే హైదరాబాద్ కు చేరుకున్నారు. కనకరత్నమ్మ పార్థివదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆమె.. రామ్ చరణ్ కు అమ్మమ్మ అవుతారన్న సంగతి అందరికీ తెలిసిందే.
అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ కుమార్తె సురేఖను మెగాస్టార్ చిరంజీవి వివాహం చేసుకోగా.. ఆమె చరణ్ కు సొంత అమ్మమ్మ అవుతారు. అందుకే పెద్ది మూవీ షూటింగ్ తో మైసూరులో బిజీగా ఉన్న ఆయన కూడా వెంటనే బ్రేక్ తీసుకుని హైదరాబాద్ కు వచ్చారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు చరణ్.
ఆ సమయంలో అక్కడే ఉన్న అల్లు అర్జున్ ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఆయనతో పలు విషయాలపై కూడా మాట్లాడారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు కనకరత్నమ్మ మరణంతో ఇద్దరూ లాంగ్ గ్యాప్ తర్వాత ఇలా ఒకే చోట.. ఆత్మీయంగా.. సన్నిహితంగా మళ్లీ కనిపించారు. అయితే చాలా ఏళ్ల క్రితం ఇద్దరూ కలిసి ఎవడు మూవీ చేసిన సంగతి విదితమే. ఇక సోషల్ మీడియాలో ఎన్ని రకాల రూమర్స్ వస్తున్నా ఆ విషయంపై పెద్దగా పట్టించుకోకుండా తామిద్దరం ఒక్కటే అన్నట్లుగా బన్నీ చరణ్ కనిపిస్తున్నారు.
