ఆ టైమ్ లో రామ్ చరణ్ కి ఎలాంటి మూవీ చేయాలో అర్థం కాలేదా?
'త్రిబుల్ ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ రీసెంట్ గా వచ్చిన 'పెద్ది' సినిమాతో మరోసారి తన నట పొటెన్షియాలిటీని బయటకు తీశాడు.
By: Gopi Velupala | 4 Oct 2026 4:00 AM IST'త్రిబుల్ ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ రీసెంట్ గా వచ్చిన 'పెద్ది' సినిమాతో మరోసారి తన నట పొటెన్షియాలిటీని బయటకు తీశాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే రామ్ చరణ్ లోని పూర్తిస్థాయి నటుడు బయటికి వస్తాడనేది వాస్తవం.గతంలో 'రంగస్థలం' సినిమాతో చిట్టిబాబు పాత్రలో అదరగొట్టిన రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ మూవీలో అప్పన్న పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నత్తి తో మాట్లాడుతూ ఆ పాత్ర పడే ఇబ్బందిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అప్పన్న పాత్రలో మనకు ఎక్కడ రామ్ చరణ్ కనిపించడు. ఇక రీసెంట్ గా చేసిన పెద్ది సినిమాలోని పాత్రకి సైతం పూర్తి న్యాయం చేశాడు. పెద్ది మూవీ ప్రేక్షకుడికి నచ్చిందా లేదా అనే విషయం పక్కన పెడితే రామ్ చరణ్ తను చేసిన పాత్రకి మాత్రం 100% న్యాయం చేశాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరోసారి జత కడుతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే చాలు ప్రేక్షకులలో ఒక హై మూమెంట్ క్రియేట్ అవుతుంది.సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కూడా ప్రేక్షకులను మాత్రం పూర్తిగా సాటిస్ఫై చేయగలుగుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఉన్నాడు...
రామ్ చరణ్ చేంజ్ ఓవర్ కి కారణం...
రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో తనకి ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కాలేదట... కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించిన రామ్ చరణ్ తనకు వరుస విజయాలు వస్తున్న కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది కాదట. నటుడిగా తనని తాను పోట్రే చేసుకోవాలని ఎప్పటికప్పుడు కసరత్తులు చేసిన కూడా అతనికి సరైన స్క్రిప్ట్ దొరకలేదట. ఇలాంటి క్రమంలోనే వరుసగా రచ్చ, నాయక్, ఎవడు లాంటి సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. అయినప్పటికి 100% సంతృప్తినిచ్చే క్యారెక్టర్ చేయలేకపోతున్నాను అంటూ తనలో తాను ఎప్పుడు మదనపడేవాడట. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో జయం రవి హీరోగా చేసిన 'తని ఓరవన్' సినిమా సూపర్ సక్సెస్ అయింది. రామ్ చరణ్ కి అది విపరీతంగా నచ్చడంతో 'ధృవ' పేరుతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు. కమర్షియల్ హీరో ఇలాంటి సినిమా చేయడం ఎక్స్పరిమెంట్ అనే చెప్పాలి. కానీ దానిని సక్సెస్ ఫుల్ గా చేసి రామ్ చరణ్ మరోసారి టాప్ హీరోగా నిలబడ్డాడు. ఇక ఆ తర్వాత ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే వచ్చే కిక్కు వేరేలా ఉంటుందని అర్థం చేసుకున్న రామ్ చరణ్ వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు...
మొదట్లో రామ్ చరణ్ ఏంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో నటించడమేంటి అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత విమర్శించిన వాళ్ళే రామ్ చరణ్ ని కీర్తించడం మొదలుపెట్టారు. ఎక్కడైతే తను అవమానాన్ని ఎదుర్కొన్నాడో అక్కడే తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు... ఇక ప్రతి ఒక్క నటుడు తన కెరియర్లో ఏదో ఒక టైమ్ లో ఎలాంటి సినిమాలు చేయాలనే ఒక డైలమాలో పడిపోతారు. ఎందుకంటే సక్సెసులు వచ్చినా కూడా తాము అనుకున్న క్యారెక్టర్లు చేయలేకపోతున్నామనే ఒక ఇబ్బంది అయితే ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. దానిని రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ గా దాటగలిగాడు అంటూ చాలామంది విమర్శకులు సైతం రామ్ చరణ్ ను ప్రశంసించడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది...
