Begin typing your search above and press return to search.

ఆ క్షణం ఎప్పటికి మర్చిపోలేను: చిరంజీవి

సరిగ్గా 18ఏళ్ల కిందట మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి కొత్త హీరో వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్చరణ్ పరిశ్రమలో అడుగు పెట్టారు.

By:  M Prashanth   |   29 Sept 2025 1:13 AM IST
ఆ క్షణం ఎప్పటికి మర్చిపోలేను: చిరంజీవి
X

సరిగ్గా 18ఏళ్ల కిందట మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి కొత్త హీరో వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్చరణ్ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా చిరుత 2007 సెప్టెంబర్ 28న రిలీజైంది. అది రిలీజై నేటికి 18ఏళ్లు పూర్తైంది. అలా చిరుతతో అరంగేట్రం చేసిన చెర్రీ.. రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రాజమౌళి తెరక్కించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ తర్వాత ఆరెంజ్ తో కాస్త డీలా పడినా మళ్లీ రచ్చ సినిమాతో చెర్రీ ఫామ్ అందుకున్నారు. అప్పుడే బాలీవుడ్ లోకి జంజీర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ, అది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఆపై తెలుగుపైనే ఫోకస్ పెట్టిన చెర్రీ... ఎవడు, నాయక్, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలోకి చెర్రీ ఎంట్రీ 18ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఓ ఎమోషనల్ నోట్ ఎక్స్ లో షేర్ చేశారు. చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం చిరుత తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు! అని చిరు పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సానతో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్ డెబ్యూకు 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా పెద్ది మేకర్స్ కూడా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. పెద్ది సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది అనే పవర్ఫుల్ కొటేషన్ రాసుకొచ్చారు. మా పెద్ది 18ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోవడం సంతోషం. వెండితెరపై వారసత్వం కొనసాగిస్తూనే బయట కూడా ఎంతో వినయ విధేయతలు కలిగి ఉంటారు. అంతేకాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. పెద్ది నుంచి చాలా పెద్ద సర్‌ ప్రైజ్‌లు మొదలు కానున్నాయి. అంటూ మేకర్స్ పోస్ట్ షేర్ చేశారు.

పెద్ది సినిమా విషయానికొస్తే... బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. అందులో ఆఖర్లో ఒక్క క్రికెట్ షాట్ తో చెర్రీ ఫ్యాన్స్ ను పిచ్చెక్కించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్‌ బ్యానర్ పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.