Begin typing your search above and press return to search.

త‌న‌ని నిల‌బెట్టుకోవ‌డానికేనా మెగా ఫోన్ ప‌ట్టింది?

సీనియ‌ర్ త‌రం హీరోల్లో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు నుంచి సూప‌ర్ స్టార్ కృష్ణ వ‌ర‌కు వెండితెర‌పై త‌మ‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూనే మ‌రో ప‌క్క త‌మ‌కు న‌చ్చిన క‌థ‌ల‌ని మెగా ఫోన్ ప‌ట్టి తెర‌పై ఆవిష్క‌రించారు.

By:  Ravindar Gorantla   |   1 July 2026 9:00 PM IST
త‌న‌ని నిల‌బెట్టుకోవ‌డానికేనా మెగా ఫోన్ ప‌ట్టింది?
X

సీనియ‌ర్ త‌రం హీరోల్లో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు నుంచి సూప‌ర్ స్టార్ కృష్ణ వ‌ర‌కు వెండితెర‌పై త‌మ‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూనే మ‌రో ప‌క్క త‌మ‌కు న‌చ్చిన క‌థ‌ల‌ని మెగా ఫోన్ ప‌ట్టి తెర‌పై ఆవిష్క‌రించారు. ఎన్నో స‌క్సెస్‌లు సాధించారు. త‌మిళంలోనూ ఆ త‌రువాత జ‌న‌రేష‌న్ యాక్ట‌ర్స్ మెగా ఫోన్ ప‌ట్టారు. అద్భుతాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ క్రేజీ హీరోలు మెగా ఫోన్ ప‌డుతున్నారు.

ఓ ప‌క్క న‌ట‌న‌తో అద‌ర‌గొడుతూనే మెగా ఫోన్ ప‌ట్టి సూప‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు. అడివి శేష్‌, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ లాంటి హీరోలు మెగా ఫోన్ ప‌ట్ట‌కుండానే క‌థ‌ల్లో, సంభాష‌ల్లో త‌మ పాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటూ త‌మ‌ని తాము నిల‌బెట్టుకుంటున్నారు. అయితే విశ్వ‌క్‌సేన్ లాంటి హీరోలు మెగా ఫోన్ కూడా ప‌ట్టి స‌క్సెస్ లు సాధిస్తుండ‌టంతో ఇప్పుడు ఇదే బాట‌లోకి ఎన‌ర్టిటిక్ స్టార్ రామ్ కూడా ప్ర‌వేశిస్తున్నాడు.

`ఆంధ్రా కింగ్ తాలూకా` సినిమా కోసం లిరిసిస్ట్‌గా (నువ్వుంటె చాలే), సింగ‌ర్‌గా (ప‌ప్పీ షేమ్‌) వ్య‌వ‌హ‌రించి అంద‌రిని షాక్ కు గురి చేసిన రామ్ ఇప్పుడు ఏకంగా మెగా ఫోన్ ప‌ట్టేసి డైరెక్ట‌ర్ అవ‌తారం ఎత్తేస్తున్నారు. రామ్ పోతినేని ఫ‌స్ట్ టైమ్ మెగా ఫోన్ ప‌ట్టి అన్నీ తానై సినిమా చేస్తున్నారు. వ‌రుస ఫ్లాపులు, కెరీర్ డౌన్ ఫాల్ కావ‌డం, త‌న స్థాయి హీరోలు అంతా రేసులో ముందుకెళుతుండ‌టంతో రామ్ త‌న‌ని తాను నిల‌బెట్టుకోవ‌డం కోస‌మే మెగా ఫోన్ ప‌ట్టి సినిమా చేస్తున్నాడ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న మూవీ షూటింగ్‌ని ప్ర‌స్తుతం రామ్ ప‌రుగులు పెట్టిస్తున్నారు. హీరోగా ఎంత ఎన‌ర్జిటిక్‌గా ఉన్నారో అంతే ఎన‌ర్జిటిక్‌గా సినిమా షూటింగ్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఉన్న‌ట్టుండి రామ్ మెగా ఫోన్ ప‌ట్టడానికి కార‌ణం త‌న‌కు స‌రైన స‌క్సెస్‌లు లేక‌పోవ‌డ‌మే. `ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌రువాత రామ్‌కు చెప్పుకోద‌గ్గ హిట్టు లేదు. రెడ్, వారియ‌ర్‌, స్కంద‌, డ‌బుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో వ‌చ్చిన ఇమేజ్‌, క్రేజ్ వీటితో క‌రిగిపోయింది.

`ఆంధ్రా కింగ్ తాలూకా` బ‌డ్జెట్ ఫెల్యూర్ మూవీగా మారి నిరాశ ప‌రిచింది. చెప్పుకోద‌గ్గ సినిమానే అయినా ఫ‌లితం మాత్రం ఆశించిన స్థాయిలో అందించ‌లేక‌పోయింది. దీంతో ఎలాగైనా రేసులో నిల‌వాల‌ని త‌న కోసం తానే మెగా ఫోన్ ప‌ట్టాడు రామ్‌. క‌థ‌ని కూడా తానే స్వ‌యంగా రాసుకోవ‌డం, స‌రికొత్త టెక్నాల‌జీతో సినిమాని తెర‌పైకి తీసుకొస్తుండ‌టంతో ఈ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది. అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే రామ్ మ‌ళ్లీ ట్రాక్ లోకి రావ‌డం ఖాయం అని రాపో ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.