Begin typing your search above and press return to search.

రామ్ ఆ సినిమాకు అన్నీ..?

ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. మహేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Ramesh Boddu   |   6 Sept 2025 10:53 AM IST
రామ్ ఆ సినిమాకు అన్నీ..?
X

ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. మహేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు రామ్ కేవలం హీరోగా మాత్రమే కాదు చాలా వాటిల్లో తన ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నాడట. అదేంటి అంటే రామ్ ఈమధ్య హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. తను చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా వర్క్ అవుట్ అవ్వట్లేదు.

నువ్వుంటె చాలు సాంగ్..

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలోని ఒక సాంగ్ కి లిరిక్స్ ఇచ్చాడు. నువ్వుంటె చాలు సాంగ్ రామ్ రాయడం క్రేజీగా అనిపించింది. రామ్ లో ఈ రేంజ్ టాలెంట్ ఎప్పటినుంచి అనేలా షాక్ ఇచ్చాడు. ఇక రామ్ మరో పాటని తానే స్వయంగా పాడాడు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు అది ఇది అని కాదు అన్నీ తానై నడిపిస్తున్నట్టు ఉన్నాడు రామ్. స్క్రిప్ట్ విషయంలో కూడా యువ దర్శకుడు మహేష్ బాబుకి కావాల్సిన ఇన్ పుట్స్ కూడా రామ్ ఇచ్చాడని తెలుస్తుంది.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే సినిమాకు ఏం కావాలన్నా తాను రెడీ అనేస్తున్నాడు. ఇక మూవీలో రామ్ యంగ్ లుక్స్ తో ఉన్న ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోగా సినిమాలో రామ్ మరో లుక్ ఉంటుందని దాన్ని రివీల్ చేయట్లేదని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా క్యామియో రోల్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలో ఆయన రోల్ కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు.

రామ్, భాగ్య శ్రీ జోడీ..

ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో బాగా హైలెట్ అయ్యేలా ఉన్న మరో అంశం . ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఈ జోడీ మళ్లీ మళ్లీ కలిసి నటిస్తే బాగుంటుందని అనిపిస్తుందట. రామ్ తో ఏ కొత్త హీరోయిన్ అయినా సరే జోడీ అదుర్స్ అనిపిస్తుంది. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా విషయంలో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి రామ్ కోరుకున్న సూపర్ హిట్ గా ఈ సినిమా టర్నవుతుందా లేదా అన్నది చూడాలి.

రామ్ మాత్రం ఆంధ్రా కింగ్ తాలూకా మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాను నవంబర్ 29 రిలీజ్ లాక్ చేశారు. దాదాపు ఆ డేట్ కి ఇది సోలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మహేష్ బాబు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి డైరెక్టర్ కి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు.