రామ్ తో సమ్ థింగ్ సమ్ థింగ్.. భాగ్యశ్రీ నవ్వేసిందేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Nov 2025 7:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఓ హీరో వీరాభిమాని కథగా రూపొందుతున్న ఆ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
సినిమాలో యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ తో ఆమెకు ఆన్ స్క్రీన్ లవ్ తోపాటు ఆఫ్ స్క్రీన్ లవ్ షూటింగ్ టైమ్ లో స్టార్ట్ అయిందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే భాగ్యశ్రీ ఓసారి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గా సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు రామ్ గెస్ట్ గా విచ్చేశారు. ఆ సమయంలో ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అని పరోక్షంగా క్వశ్చన్ వేశారు జగ్గూ భాయ్. దీంతో రిలేషన్ షిప్స్ విషయానికొస్తే.. తాను ఎప్పుడూ గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానని, అది తన పర్సనల్ మ్యాటర్ అని తెలిపారు.
ఆ తర్వాత భాగ్యశ్రీ కేవలం హీరోయిన్ మాత్రమేనా లేక ఇంకేమైనా ఉందా అని జగ్గూ భాయ్.. మరో ప్రశ్న వేయగా, నవ్వుతూ ఊరుకున్నారు రామ్. దీంతో రామ్, భాగ్యశ్రీ లవ్ కు సంబంధించిన ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పుడు భాగ్యశ్రీ కూడా అలాంటి క్వశ్చన్ కు ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా నవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చిట్ చాట్ నిర్వహించారు భాగ్యశ్రీ. ఆ సమయంలో రామ్ ను యాంకర్ శ్రీముఖి ఇంట్రావర్ట్ అంటూ వర్ణించింది. దీంతో భాగ్యశ్రీ.. తాను అది నిజం కాదని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే మరి మీతో రామ్ ఎలా ఉంటున్నారని శ్రీముఖి.. హీరోయిన్ ను అడిగింది.
తనతో ఎక్సట్రావర్ట్ అని అనుకుంటున్నట్లు భాగ్యశ్రీ చెప్పగా.. వెంటనే శ్రీముఖి వారిని ఆట పట్టించింది. ఇద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ వ్యాఖ్యానించింది. కానీ భాగ్యశ్రీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నవ్వేశారు. దీంతో నిజంగా సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని.. అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అసలు వారిద్దరూ మధ్య ఏమైనా ఉందా లేదా అనేది వారికే తెలియాలి.
