రామ్ తో అతను ఫిక్స్.. సూపర్ క్రేజీ కాంబో..!
అసలైతే రామ్, అనిల్ రావిపూడి ఎనిమిదేళ్ల క్రితమే రాజా ది గ్రేట్ సినిమా చేయాల్సింది. అనిల్ తో రామ్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.
By: Ramesh Boddu | 14 Nov 2025 6:00 PM ISTఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ఈ మంత్ ఎండ్ లో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఐతే ఈ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడన్న డిస్కషన్ మొదలైంది. ఒకరిద్దరి దర్శకుల పేర్లు చర్చల్లో ఉన్నాయి. ఐతే ప్రత్యేకంగా ఒక దర్శకుడితో రామ్ సినిమా ఉంటుందని బాగా చెప్పుకుంటున్నారు. అతనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
రామ్, అనిల్ రావిపూడి ఎనిమిదేళ్ల క్రితమే..
పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అనిల్ రావిపూడి సినిమాలన్నీ వరుస సక్సెస్ లు అందుకున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చేస్తున్నాడు. ఆ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి రామ్ తో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.
అసలైతే రామ్, అనిల్ రావిపూడి ఎనిమిదేళ్ల క్రితమే రాజా ది గ్రేట్ సినిమా చేయాల్సింది. అనిల్ తో రామ్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈసారి బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్నట్టు రామ్ తన సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేశాడు. ఐతే ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ లోకి రామ్ బదులుగా రవితేజ వచ్చాడు. రాజా ది గ్రేట్ సక్సెస్ తో అనిల్ తన జోరు కొనసాగించాడు. ఆ తర్వాత రామ్ అనిల్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఫైనల్ గా మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా సెట్ అవుతుందని తెలుస్తుంది.
ఆంధ్రా కింగ్ తర్వాత రామ్..
తప్పకుండా రామ్ లాంటి ఎనర్జీ ఉన్న స్టార్ తో అనిల్ లాంటి సూపర్ హిట్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ కి కూడా ఒక మంచి ఎనర్జిటిక్ సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఆంధ్రా కింగ్ తర్వాత రామ్ చేసే సినిమా అనిల్ రావిపూడిదే అనే టాక్ ఐతే వినిపిస్తుంది. ఐతే హీరో, డైరెక్టర్ ఇద్దరు దీన్ని కన్ ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏది ఏమైనా రామ్ ఈ కాంబో సెట్ చేసుకుంటే మాత్రం అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి డెఫినెట్ గా హిట్ పడే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ క్రేజీ కాంబో నిజంగానే సెట్ అవుతుందా ప్రాజెక్ట్ ఓకే అవుతుందా అన్నది చూడాలి.
అనిల్ రావిపూడి కూడా వరుస హిట్లు కొడుతూనే సినిమా సినిమాకి కొత్త కాంబినేషన్స్ తో అదరగొడుతున్నాడు. చిరు తర్వాత నాగార్జున తో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ సీనియర్ స్టార్స్ వెంకటేష్, బాలకృష్ణతో పనిచేసిన అనిల్ ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ తో చిరుతో కలిసి చేస్తున్నాడు. సో మిగిలింది నాగార్జున మాత్రమే కాబట్టి నాగ్ తో కూడా అనిల్ కాంబో సెట్ అయితే అక్కినేని ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు.
