ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని నుంచి వస్తున్న ప్రతీ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.
By: M Prashanth | 17 Nov 2025 12:25 PM IST'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని నుంచి వస్తున్న ప్రతీ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. ఎందుకంటే అతను ప్రతీ సినిమాతో కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈసారి ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాపై కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. బడా హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా కావడంతో, 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై ట్రేడ్ వర్గాల్లో సైతం గట్టి బజ్ నడుస్తోంది.
ఇది రొటీన్ మసాలా సినిమా కాదు, "బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్" (ఒక అభిమాని బయోపిక్) అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఔట్‌పుట్‌పై హీరో రామ్, నిర్మాతలు ఎంత నమ్మకంతో ఉన్నారంటే, ముందుగా ప్రకటించిన నవంబర్ 28కి బదులుగా, ఒక రోజు ముందే.. అంటే నవంబర్ 27నే సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రామ్ ఫైనల్ కాపీ చూసుకున్నాడట. ఎక్కడ బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ టైమింగ్ లో సినిమా కొనసాగుతుందట. ఇక ఈసారి హిట్టు గ్యారెంటి అనే నమ్మకంతో రామ్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాన్ఫిడెంట్ వచ్చాకనే అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.
ఈ నమ్మకానికి తగ్గట్టే, వివేక్ మెర్విన్ అందించిన పాటలు కూడా ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. రామ్, మైత్రీ సంస్థల ఇంతటి నమ్మకానికి అసలు కారణం దర్శకుడు మహేష్ బాబు పి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆయన రాసుకున్న ఈ అభిమాని బయోపిక్ కథ, భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా కొత్తగా ఉందట. దర్శకుడు మహేష్ బాబు ఈ యూనిక్ పాయింట్‌ను అద్భుతంగా డీల్ చేశారని, అందుకే రామ్ ఈ ప్రాజెక్ట్‌ను అంతగా నమ్మాడని తెలుస్తోంది.
ఈ సినిమా కేవలం రామ్ ఇమేజ్‌పైనే కాకుండా, కథనంపై బలంగా ఆధారపడి ఉంటుందని సమాచారం. "ప్రేక్షకులు ఈ సినిమాలో తమను తాము చూసుకుంటారు" అని మైత్రీ మూవీ మేకర్స్ చెబుతుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ వినూత్న కథకు కన్నడ స్టార్ ఉపేంద్ర లాంటి పవర్‌ఫుల్ యాక్టర్ కీలక పాత్రలో నటించడం సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.
సాంకేతికంగా కూడా ఈ సినిమాకు టాప్ టీమ్ పనిచేసింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ దీనికి ఎడిటర్‌గా పనిచేస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే పాటలతో హైప్ తెచ్చిన టీమ్, నవంబర్ 18న కర్నూలులో భారీ ఎత్తున పబ్లిక్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఏదేమైనా సరికొత్త కాన్సెప్ట్ లో నెవ్వర్ బిఫోర్ అనే కాంబినేషన్ లో వస్తున్న ఆంధ్రా కింగ్ తాలుకా మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. ఇక నవంబర్ 27న రాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి.
