సింగర్ గా రామ్.. ఆంధ్రా కింగ్ కొత్త పాట విన్నారా?
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 8 Sept 2025 10:45 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.
కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సినిమాలో సూర్య కుమార్ గా హీరో రోల్ లో కనిపించనున్నారు. ఉపేంద్రకు అభిమానిగా రామ్ సందడి చేయనున్నారు. మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
హీరోకు, ఆయన ఫ్యాన్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనలతో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో సినిమా రూపొందుతుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ తో సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. రీసెంట్ గా రామ్ లిరిక్స్ అందించిన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే కూడా ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే తొలి సాంగ్ కు లిరిక్స్ అందించిన రామ్.. ఇప్పుడు సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ ను ఆలపించడం విశేషం. మొత్తానికి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి గాను తనలోనే టాలెంట్ మొత్తాన్ని ఆయన బయటపెడుతున్నారు.
అయితే .'ఈడి మోహం ఏంట్రా మా.... డి పోయింది. మావా నువ్వు అందుకోరా. పోతాదన్నావ్ ఇప్పుడేంటన్నా' అంటూ సాగుతున్న సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. భాస్కరభట్ల ఆకర్షణీయమైన లిరిక్స్ అందించగా... వివేక్, మెర్విన్ సరైన మ్యూజిక్ అందించారు. ఇప్పుడు సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
రామ్ కూడా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. స్పెషల్ వైబ్స్ ను క్రియేట్ చేశారు. ఫుల్ జోష్, ఎనర్జీతో పాడి మెప్పించారు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ ఫుల్ గా సందడి చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా కోసం రైటర్, సింగర్ గా మారిన రామ్.. మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి నవంబర్ 28న రిలీజ్ కానున్న మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
