RAPO ఈసారి కొడుతున్నామనే ధీమా
నిజానికి ఈ సినిమా కోసం అతడు రెండు పాటలు పాడటమే గాక, ఒక పాటకు సాహిత్యం కూడా అందించాడు. పాటలకు అద్భుత స్పందన వస్తోంది.
By: Sivaji Kontham | 24 Nov 2025 7:28 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దేశ విదేశాలలో ప్రీమియర్లతో సందడి మొదలు కానుంది. అమెరికా అంతటా ముందస్తు ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విశాఖలో భారీ ప్రచార వేదికపై రామ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు. తన సినిమా కంటెంట్ పై నమ్మకం అతడిలో స్పష్ఠంగా కనిపించింది. ఈసారి ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొడుతున్నాననే ధీమా అతడిలో కనిపిస్తోంది. రామ్ కి ఈ చిత్రంలో ఏదో ఒక ఎలిమెంట్ బలంగా కనెక్టయింది. అది ఆడియెన్ కి కూడా కనెక్టవుతుందని అతడు నమ్ముతున్నాడు.
అందుకే అతడు తన సినిమా ప్రమోషన్లలోను ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. దూకుడుగా ప్రమోట్ చేస్తూ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటీవల భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో తన సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూల్, వైజాగ్ లలో వరుస కార్యక్రమాలకు రామ్ అటెండయ్యాడు. జోరుగా తన కంటెంట్‌ని ప్రచారం చేసాడు.తదుపరి అమెరికాలో అభిమానులను కలిసేందుకు వెళుతున్నాడు. రామ్ స్పీడ్ చూస్తుంటే ఈసారి తాను ఆశించిన బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని అర్థమవుతోంది.
నిజానికి ఈ సినిమా కోసం అతడు రెండు పాటలు పాడటమే గాక, ఒక పాటకు సాహిత్యం కూడా అందించాడు. పాటలకు అద్భుత స్పందన వస్తోంది. ట్రైలర్‌తో ఉత్సాహం పెరిగింది గనుక, ఇప్పుడు రామ్ పోతినేని మరింత నమ్మకంతో ప్రచారంలో ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం తన సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేస్తూ రామ్ ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. అతడి శ్రమ బాక్సాఫీస్ రిజల్ట్ లో ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం.
ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది. వివేక్ - మెర్విన్ మ్యూజిక్ అందించారు.
ఒక సినిమా హీరో చుట్టూ తిరిగే అభిమాని కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ప్రతి హీరో అభిమాని ఇది నా స్టోరీ అనిపించేలా ఈ మూవీ కంటెంట్‌ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ సినిమాలో హ్యూమానిటీ, ఎమోషన్స్ అందరినీ కట్టి పడేస్తాయని టీమ్ నమ్ముతోంది.
