ఆ ద్వయానికి ఛాన్స్ ఇచ్చింది రామ్!
`ఆంధ్రాకింగ్ తాలూకా` చిత్రానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కర్త, కర్మ, క్రియగా పని చేసినట్లు చెప్పొచ్చు.
By: Srikanth Kontham | 27 Nov 2025 4:00 PM IST`ఆంధ్రాకింగ్ తాలూకా` చిత్రానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కర్త, కర్మ, క్రియగా పని చేసినట్లు చెప్పొచ్చు. తొలుత ఈ కథను దర్శకుడు మహేష్ నుంచి విన్నది రామ్. అక్కడ నుంచి స్క్రిప్ట్ మైత్రీ మూవీ మేకర్స్ కు చేరింది. రామ్ చెప్పడంతో మైత్రీ నిర్మాతలు ఒకే చెప్పారు. అక్కడ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే స్క్రిప్ట్ ఒకే అయింది. దీంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రామ్ గనుక ఛాన్స్ తీసుకోకపోయి ఉంటే? ఇది పట్టాలెక్కేది కాదు. రామ్ ప్లాప్ ల్లో ఉన్నా? అతడి పై నమ్మకంతో పాటు, కథపై నమ్మకంతో ముందుకొచ్చారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్లను కూడా రామ్ నే సెట్ చేసాడని తేలింది.
తమిళ ప్రతిభకు పెద్ద పీట:
తమిళ దర్శక ద్వయం వివేక్-మెర్విన్ లైతే ఈ కథకు బాగుంటుందని వాళ్లను పిలిపించి సంగీతం బాధ్యతలు అప్పగించారు. తెలుగులో ఇంత వరకూ ఈ ద్వయం ఏ సినిమాకు పని చేయలేదు. `ఆంధ్రాకింగ్ తాలూకా`తోనే టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. అంతకు ముందు తమిళ్ లో 20 సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేసారు. కానీ వారి ప్రతిభను టాలీవుడ్ లో ఏ మేకర్ గుర్తించలేదు. ఆ సమయంలో రామ్ వాళ్ల ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారు. ఆ రకంగా వివేక్ -మెర్విన్ టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. ఈ సినిమాలో ఓ పాటను రామ్ రచించడం విశేషం.
డైరెక్టర్ కు పని ఈజీ:
అంతేనా ఆ పాటను ఏకంగా అనిరుద్ తో పాడిండచం అంతకు మించిన గొప్ప విశేషంగా చెప్పొచ్చు. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో దర్శకుడు ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. అతడు కూడా కొంత మందిని తీసుకుం దామనే ఆలోచనలో ఉంటారు. కానీ మహేష్ విషయంలో ఆఛాన్స్ కూడా రామ్ తీసుకోవడంతో? పని ఈజీ అయింది. కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో రామ్ ఖాతాలో చాలా కాలానికి హిట్ పడినట్లే. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఆప్రభావం మార్కెట్ పై కూడా పడింది.
అన్నీ జానర్ చిత్రాలకు సిద్దంగా:
కొత్త కమిట్ మెంట్లు కూడా తగ్గాయి. కానీ తాజా విజయంతో అన్నీ మళ్లీ సెట్ అవ్వడం ఖాయం. అలాగే వివేక్-మెర్విన్ లకు ఇకపై అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్ లకు ఒకే చెప్పారు. కానీ వీటి విరాలు ఆ చిత్ర నిర్మాత లే ప్రకటిస్తారని గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఈ సంగీత ద్వయం కోలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అన్ని జానర్ చిత్రాలకు తాము సంగీతం అందించడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలుగులో సొంత ప్రతిభ కంటే పరభాషా ప్రతిభావంతులకు మంచి అవకాశాలు దక్కుతుంటాయన్నది తెలిసిందే.
