ఆంధ్రా కింగ్ తాలూకా.. పోతినేనికి వచ్చిందెంత?
అయితే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు పాజిటివ్ రివ్యూస్, టాక్ వచ్చినప్పటికీ.. రామ్ పోతినేనికి మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం అందలేదని చెప్పాలి.
By: M Prashanth | 5 Dec 2025 12:12 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్.. గత వారమే థియేటర్స్ లోకి ఆ సినిమాతో వచ్చారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో ఫిదా చేశారు.
అయితే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు పాజిటివ్ రివ్యూస్, టాక్ వచ్చినప్పటికీ.. రామ్ పోతినేనికి మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం అందలేదని చెప్పాలి. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద మూవీ అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాబట్టలేదు. రిలీజ్ అయ్యి వారం అవ్వగా.. మోస్తరుగానే కలెక్షన్స్ ను సాధించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అఖండ-2 వాయిదా పడడంతో కొంత వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రామ్ కు సినిమా ద్వారా ఎంత వచ్చిందోనని ఇప్పుడు సినీ ప్రియులు, నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి గాను రామ్.. రెమ్యునరేషన్ గా రూ.2.5 కోట్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతోపాటు ఆయన నైజాంతోపాటు గుంటూరు సినిమా థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. దీంతో అక్కడ వచ్చిన కలెక్షన్లు.. ఆయనకు అందుతాయి. నైజాం ఏరియా ద్వారా రామ్ కు రూ.2 కోట్లకు పైగా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.40- 50 లక్షల వరకు గుంటూరు ఏరియా తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతోంది.
అలా మొత్తం కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి దాదాపు రూ.5 కోట్ల వరకు వచ్చి ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతో మాత్రం క్లారిటీ లేదు. కేవలం వార్తలు వైరల్ గా మారాయి అంతే. సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టి ఉంటే.. రామ్ కు ఇంకా ఎక్కువ వచ్చేదని అంటున్నారు నెటిజన్లు.
అయితే ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత రామ్ కొత్త దర్శకుడు కిషోర్ తో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై కిషోర్.. విభిన్నమైన హారర్ థ్రిల్లర్ తీయనున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. ఇప్పటికే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్.
