Begin typing your search above and press return to search.

అగ్ర హీరోల‌తో ఛాన్స్ వచ్చినా త‌న స్టైల్లోనే!

`సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`తో మంచి వినోదాత్మ‌క విజ‌యాన్ని అందుకున్న యువ ద‌ర్శ‌కుడు రామ్ అబ్బ‌రాజ్.

By:  Srikanth Kontham   |   10 Jan 2026 4:00 PM IST
అగ్ర హీరోల‌తో ఛాన్స్ వచ్చినా త‌న స్టైల్లోనే!
X

`సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`తో మంచి వినోదాత్మ‌క విజ‌యాన్ని అందుకున్న యువ ద‌ర్శ‌కుడు రామ్ అబ్బ‌రాజ్. శ్రీ విష్ణు హీరోగా న‌టించిన ఈ సినిమా చ‌క్క‌ని విజ‌యాన్ని అందుకుంది. ఎలాంటి అస‌భ్య‌త లేకుండా క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ గా రామ్ అబ్బ‌రాజ్ మ‌లిచిన చిత్ర‌మిది. ఈ విజ‌యంతో ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ద‌క్కింది. టైర్ 2, టైర్ 3 హీరోల‌కు త‌గ్గ ద‌ర్శ‌కుడిగా మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తొలి సినిమాతోనూ ప్రూవ్ చేసుకున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే ఛాన్సులు అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం మ‌రో యంగ్ హీరో శ‌ర్వానంద్ హీరోగా `నారీ నారీ న‌డుమ మురారీ` అనే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు.

ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా శ‌ర్వానంద్ ని తెర‌పై హైలైట్ చేస్తున్నాడు. ఇదీ స్వ‌చ్ఛ‌మైన వినోదంతో కూడిన చిత్రంగానే తెర‌కెక్కింది. శ‌ర్వానంద్ న‌టించిన గ‌త ఎంట‌ర్ టైన‌ర్లు `ర‌న్ రాజా ర‌న్`, `మ‌హానుభావుడు` మంచి విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఈ చిత్రం కూడా ఉంటుంద‌ని రామ్ అబ్బ‌రాజ్ హింట్ ఇచ్చేసాడు. ఈ సినిమా హిట్ అయితే రామ్ అబ్బ‌రాజ్ స్టార్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. అప్పుడు స్టార్స్ ప‌రంగా అప్ గ్రేడ్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంటుంది. మ‌రి అలా ఓ పెద్ద స్టార్ తో అవ‌కాశం వ‌స్తే ఎలాంటి సినిమా తీస్తారు? అంటే!

రామ్ అబ్బ‌రాజ్ మాత్రం త‌న శైలి వ‌దిలి ప్ర‌యోగాల‌కు వెళ్ల‌నంటున్నాడు. త‌న బ‌లం కామెడీ జాన‌ర్ అని. స్టార్స్ తో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చినా? త‌న‌దైన శైలిలో మంచి వినోదాత్మ‌క సినిమానే చేస్తాన‌న్నాడు. అవ‌కాశం వ‌చ్చింద‌ని ప్ర‌యోగాలు చేయ‌డం..ఇష్టారీతున త‌న ఫ‌రిది దాటి ఛాన్స్ తీసుకోన‌న్నాడు. ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చు కోవ‌డం క‌న్నా? త‌న‌కు తెలిసిన క‌థ‌ను త‌న స్టైల్లో చెప్పి ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌గ‌ల‌ను అన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసాడు. ద‌ర్శ‌కుడిగా తాను ఓ క్లారిటీ గా ఉన్నాడ‌ని అత‌డి మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అలాగే రామ్ అబ్బ‌రాజ్ త‌దుప‌రి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ లో లాక్ అయింద‌న్న విష‌యాన్ని ధృవీక‌రించాడు. సినిమా క్రైమ్ కామెడీ జానర్ లో ఉంటుందన్నాడు. అయితే అందులో హీరో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. క్రైమ్ అంశాన్ని ఎంచుకున్నా? అందులో కామెడీ మాత్రం మిస్ అవ్వ‌లేద‌ని తాజా ప్ర‌క‌ట‌న‌తో మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో కామెడీ జాన‌ర్ ని తానెంత విశ్వస్తున్నాడు అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఈ సినిమా అనంత‌రం శ్రీవిష్ణు హీరోగా `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న 2` చిత్రం ఉంటుంద‌న్నాడు.