పిక్‌టాక్ : మినీ డ్రెస్‌లో రకుల్ అందాల షో
కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు 2011లో పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
By: Ramesh Palla | 15 Oct 2025 3:39 PM ISTకెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు 2011లో పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమా పెద్దగా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్‌కు మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ఈమె వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపుగా పదేళ్ల పాటు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు యంగ్ స్టార్ హీరోలతో రకుల్ ప్రీత్ సినిమాలు చేయడం ద్వారా స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఒక్కసారిగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ అదే స్థాయిలో కిందకు పడిపోయింది. తెలుగులో ఈమె సినిమా వచ్చి చాలా కాలం అయింది. అయినా కూడా ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్ తగ్గలేదు.
కొండపొలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్
2021లో కొండపొలం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో మళ్లీ కనిపించలేదు. ఒకటి రెండు చిన్న చితకా ఆఫర్లు వచ్చినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. తెలుగులో ఈమె నటించకున్నా తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఆఫర్ల కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో నటించిన మేరీ హస్బెండ్ కి బీవీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హిందీలో మరో ఆఫర్ ను దక్కించుకుంది. గతంలో తాను నటించిన దే దే ప్యార్ దే సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో నటించేందుకు ఎంపిక అయింది. ఇదే ఏడాదిలో ఆ సినిమా రాబోతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత
ఇక రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటిలాగే ఈసారి కూడా స్కిన్ షో చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు. పొట్టి నిక్కర్, మినీ డ్రెస్ ను ధరించిన ఈ అమ్మడు అందంకు నిలువెత్తు నిదర్శణం అన్నట్లుగా కనిపిస్తుంది అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌ను అప్పుడే తెలుగు ప్రేక్షకులు ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా తెలుగులో ఈమె రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
గిల్లి సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో
రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీలోని సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భారత సైన్యంలో కీలక పదవిలో కొనసాగారు. తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా నటుడు అనే విషయం తెల్సిందే. పాఠశాల విద్యను ధౌలా కువాన్‌లోని ఆర్మీ స్కూల్ లో పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత ఢిల్లీలో తన ఉన్నత చదువును పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రకుల్ కన్నడ చిత్రం గిల్లితో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమెకు మంచి విజయాలు దక్కాయి. ఈమె ఏకంగా నాలుగు సార్లు సౌత్ ఫిల్మ్ ఫేం అవార్డ్‌ల్లో నామినేషన్స్ దక్కించుకుంది. కేవలం నటిగానే కాకుండా చాలా కంపెనీలకు ఈమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఇటీవలే ఈమె జాకీ భగ్నానిని వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉండాలని ప్రయత్నాలు చేస్తోంది.
