వీడియో : రకుల్ ఫిట్‌నెస్ మంత్ర ఇదేనా?
కన్నడ మూవీ గిల్లితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలో టాప్ స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది
By: Ramesh Palla | 2 Aug 2025 12:39 PM ISTకన్నడ మూవీ గిల్లితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలో టాప్ స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. తెలుగులో ఈమె చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఏడు.. ఎనిమిది ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ గత మూడు నాలుగు ఏళ్లుగా కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. తెలుగులో అందరు హీరోలతో సినిమాలు చేయడంతో ఇక చేయడానికి ఏమీ లేకపోవడం వల్ల ఈమెకు ఆఫర్లు రావడం లేదని చాలా మంది ఆ సమయంలో కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిన సమయంలో లక్కీగా బాలీవుడ్ నుంచి ఈమెకు ఆఫర్లు వచ్చాయి.
జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి
బాలీవుడ్‌లో ఏకంగా అరడజను సినిమా ఆఫర్లు దక్కాయి. రెండేళ్ల కాలంలో హిందీలో ఏకంగా పది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఎక్కువ శాతం ఫ్లాప్ కావడంతో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కి అక్కడ కూడా నిరాశే మిగిలింది. ప్రస్తుతం తమిళ్, హిందీతో పాటు తెలుగులోనూ మళ్లీ ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు గుడ్ బై చెబుతుందని అంతా భావించారు. కానీ ఆమె తన పెళ్లి తర్వాత సినిమాల్లో నటించే ఆసక్తిని పలు సందర్భాల్లో వెళ్లడించింది. ముందు ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్ సింగ్
తాజాగా స్విమ్మింగ్ ఛాలెంజ్‌ను స్వీకరించి ఆపకుండా రెండు రౌండ్స్ స్విమ్ చేయడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ప్రొఫెషనల్ స్విమ్మర్స్ చేసినట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన స్విమ్మింగ్ అందరినీ సర్‌ప్రైజ్‌కి గురి చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అందంతో పాటు, మంచి ఫిజిక్ ఆమెను స్టార్‌గా నిలిపింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంకు ఆమె అందం కారణం అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క అందం కారణంగానే తిరిగి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలతో పాటు, ఈ స్విమ్మింగ్ వీడియో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రకుల్ ఇంత ఫిట్‌గా ఉండటానికి స్విమ్మింగ్ కూడా ఒక కారణం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దే దే ప్యార్ దే 2 సినిమా షూట్‌లో రకుల్
ఈ ఏడాదిలో ఇప్పటికే మేరే హస్బెండ్‌కి బీవీ సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోలేదు. దాంతో హిందీలోనే సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో దే దే ప్యార్ దే సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ నుంచి రెగ్యులర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సీక్వెల్ తర్వాత ఇండియన్ 3 సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ రీ ఎంట్రీకి, సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ అమ్మడి ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అయ్యేను చూడాలి.
