Begin typing your search above and press return to search.

వైట్ డ్రెస్ లో రకుల్ అందాలు..

తాజాగా వైట్ డ్రెస్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ డోర్ దగ్గర స్టైలిష్ గా నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది.

By:  Madhu Reddy   |   2 Nov 2025 3:00 PM IST
వైట్ డ్రెస్ లో రకుల్ అందాలు..
X

హీరోయిన్స్ అందరూ ఈమధ్య కాస్త సమయం దొరికితే చాలు గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకొని ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అలా తాజాగా అందాల తారగా పేరు సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను మంత్రముగ్ధుల్ని చేసింది.




తాజాగా వైట్ డ్రెస్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ డోర్ దగ్గర స్టైలిష్ గా నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అందానికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు రకుల్ షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ గా పలు రకాల కామెంట్లు చేస్తూ.. లవ్ , ఫైర్ ఎమోజిలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే..2009లో గిల్లి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత కెరటం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకోవాలని చూసింది.. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో ప్రార్ధన అనే పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అనే డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.




అటు హిందీలో యారియాన్ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. మళ్లీ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేసుకో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా చిత్రాలలోనే నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కాలంలో కాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ఏడడుగులు వేసింది. ఇక జాకీను వివాహం చేసుకున్న తర్వాత బాలీవుడ్ లోనే సెటిలైపోయిన ఈమె అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.



ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల మేరే హస్బెండ్ కి బీవీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఇండియన్ 3 సినిమాలో హీరోయిన్గా అవకాశం లభించింది. అలాగే దే దే ప్యార్ దే 2 సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో నైనా రకుల్ హిందీలో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఎప్పుడు సరైన సక్సెస్ పడుతుందో చూడాలి.