Begin typing your search above and press return to search.

శూర్పణఖ సంచలన వ్యాఖ్యలు!

ఈ పాత్ర సాధారణ ప్రతినాయకురాలి పాత్ర కాదని.. కథలో భావోద్వేగాలతో కూడిన పాత్ర అని పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   19 Oct 2026 7:00 PM IST
శూర్పణఖ సంచలన వ్యాఖ్యలు!
X

బాలీవుడ్ లో నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో `రామాయణ గాథ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న రామాయ‌ణం మొద‌టి భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో నటి రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో చిత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రామాయణంలో ఎంతో కీలకమైన కథను మలుపు తిప్పే నెగెటివ్ ఛాయలున్న శూర్పణఖ పాత్రకు జీవం పోయడం గురించి రకుల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ పాత్ర సాధారణ ప్రతినాయకురాలి పాత్ర కాదని.. కథలో భావోద్వేగాలతో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టం, దర్శకులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న కేర్ గురించి చెబుతూ ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో, ఇంతటి వ్యూహాత్మక ప్రయోగం జరగడం ఇదే మొదటిసారన్నారు.

ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాల‌కు భిన్నంగా ఈ సినిమాను ఆధునిక సాంకేతిక హంగులతో, విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. సాంప్రదాయ కథాంశాన్ని దెబ్బతీయకుండా నేటి తరానికి నప్పేలా సరికొత్త కథనంతో సినిమాను రూపొందించిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుందన్నారు.

సినిమాలో శూర్పణఖ పాత్రకు సంబంధించిన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నమైనదని.. నటిగా తనలోని మరో కోణాన్ని ఈ సినిమా బయటపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం తన కెరీర్‌లో సంతృప్తికరమైన అనుభవమని తెలిపారు.

దర్శక, నిర్మాతలు పడిన తపస్సు తెరపై స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రతి నటుడికి ఇలాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయని ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తు న్నానని తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు రామాయణాన్ని.. అందులోని పాత్రలను కొత్త కోణంలో చూస్తారని ధీమా వ్య‌క్తం చేసారు. రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలను అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాలో రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్..సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి..రావ‌ణాసురుడి పాత్ర‌లో య‌శ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.