గ్లామర్ తో కట్టిపడేస్తున్న రకుల్..
అయితే తాజాగా ఈ పాటను మరోసారి గుర్తు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను పంచుకుంది.
By: Madhu Reddy | 30 Oct 2025 3:17 PM ISTరకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది.. కుర్రకారు మతి పోగొట్టే స్టన్నింగ్ ఫోజులతో ఉన్న తాజా ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. అజయ్ దేవగన్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే -2 మూవీ కోసం రెడీ అవుతోంది..ఈ మధ్యనే ఈ మూవీ "జూమ్ షరాబీ"అనే పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.అయితే తాజాగా ఈ పాటను మరోసారి గుర్తు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను పంచుకుంది.
ఈ ఫోటోలలో తన స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ హాట్ ఫోటోలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ " ఆయేషా పూచ్ రహి హై జూమ్ షరాబీ కైసా లగా?. #dedepyarde2 అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫోటోలతో పాటు ఆమె పెట్టిన యాష్ ట్యాగ్ కూడా నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది.రకుల్ ప్రీత్ సింగ్ ఈ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాలకే చాలా మంది ఆమె అభిమానులు హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలకు నా హృదయ రాణి అని కామెంట్ పెట్టారు.
ఆ ఫోటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచి ఎలా అయితే ఒళ్ళు విరుస్తారో అలాంటి హాట్ ఫోజులు పెట్టింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు ఆమె పెట్టిన పోస్ట్ కు సంబంధించిన పాట కూడా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది.. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినీ పర్సనల్ కెరీర్ విషయాలకు వస్తే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కెరటం అనే మూవీ తో వచ్చినప్పటికీ ఈ సినిమా అంత పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ హిట్ కొట్టడంతో రకుల్ కి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి.అలా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, నాగ చైతన్య, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.
ఈ హీరోయిన్ దక్షిణాదిలో చివరిగా గత ఏడాది భారతీయుడు -2 తో పాటు తమిళంలో అయలాన్ అనే మూవీలో కనిపించింది. కానీ ఈ సినిమాలు ఏవి రకుల్ కెరీర్ ని సౌత్ లో నిలబెట్టలేకపోయాయి. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ గా వచ్చిన దే దే ప్యార్ దే -2 మూవీ నవంబర్ 14న విడుదల కాబోతోంది.అజయ్ దేవగన్, ఆర్. మాధవన్,రకుల్ ప్రీత్ సింగ్ లు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమానే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో మరో రెండు, మూడు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.అలా పతీ పత్ని ఔర్ ఓహ్ దో మూవీ తో పాటు ఇండియన్ 2 మూవీ సీక్వెల్ ఇండియన్ -3లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో వస్తున్న రామాయణ మూవీలో సూర్పనఖ పాత్రలో కూడా రకుల్ నటిస్తోంది.
