రాయల్ లుక్ లో రకుల్ గ్లామర్ ట్రీట్.. మేనిఛాయతో మైమరపిస్తూ..
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన చీర విషయానికి వస్తే.. లేత బంగారు వర్ణం కలిగిన టిష్యూ చీరను ఈమె ధరించింది.
By: Madhu Reddy | 20 Oct 2026 11:55 AM ISTఅందం అభినయంతో ఆకట్టుకుంటూ ఆడియన్స్ ని మైమరిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటో షూట్ తో ఆడియన్స్ ఆకట్టుకునే ఈమె.. తాజాగా రాయల్ లుక్ లో కనిపించి పండుగ వైభవాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న ఈమె.. తాజాగా మరో అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
సాంప్రదాయం ఉట్టిపడేలా బంగారు వర్ణం చీరలో మెయిన్ ఛాయను మైమరిపిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.గత రెండు మూడు రోజులుగా ఆమె నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ బడా ప్రాజెక్టు రామాయణ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీగా మారిన ఈమె మరొకవైపు ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఇలా దర్శనమిచ్చింది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన చీర విషయానికి వస్తే.. లేత బంగారు వర్ణం కలిగిన టిష్యూ చీరను ఈమె ధరించింది. దీనికి బార్డర్లో అద్దాల పూసలతో చక్కగా డిజైన్ చేసిన వెడల్పాటి అంచుతో ఈ చీరను రూపొందించారు. లోతైన మెడ భాగం కుచ్చుల వలె వేలాడుతున్న క్రిస్టల్ ఫ్రింజ్ తో కేప్ తరహా చేతులు డిజైన్ చేశారు. అలాగే బంగారు చాంద్ బలి చెవిపోగులు ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో అదే తరహా బంగారు గాజులు ధరించింది.
ఇక జుట్టు విషయానికి వస్తే ముఖం చుట్టూ చిన్నటి ముంగురులు పడేలా జుట్టును వదిలేసి.. వెనుక భాగంలో ముడి వేసుకుంది . ఇక నుదుటిపై చిన్న బొట్టు పెట్టుకొని మెరిసే అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొత్తానికైతే పండుగ వేళ రకుల్ ప్రీత్ సింగ్ కట్టుకున్న ఈ చీర మరింత అందంగా మెరిసిపోతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది . ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యశ్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇక లారాదత్త, అనుపమ్ కేర్ లాంటి భారీ తారగణం కూడా ఇందులో భాగమైంది. నవంబర్ 6వ తేదీన థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఇక మిగతా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
