Begin typing your search above and press return to search.

నా ఇష్టమైన ప్రదేశానికి మళ్లీ వచ్చేశా.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్.

By:  Madhu Reddy   |   27 July 2026 9:26 PM IST
నా ఇష్టమైన ప్రదేశానికి మళ్లీ వచ్చేశా.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్!
X

టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ భామ, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాయల్ బ్లూ స్పోర్ట్స్ బ్రా, కంప్రెషన్ లెగ్గింగ్స్‌లో అదిరిపోయే వర్కవుట్ పిక్స్ షేర్ చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం వర్కవుట్ సమయంలో తీవ్ర గాయానికి గురై జిమ్‌కు దూరమైన రకుల్, మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.




గాయం నా ప్రయాణాన్ని ఆపేసింది:

తన గాయం, రికవరీ ప్రయాణం గురించి పంచుకుంటూ.. "ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని అధ్యాయాలు ఉంటాయి. నా విషయంలో అది ఒక గాయం రూపంలో వచ్చింది. రోజురోజుకూ నా శరీరాన్ని దృఢంగా మార్చుకోవాలనుకుంటున్న సమయంలో ఒక గాయం నన్ను పూర్తిగా ఆపేసింది. కేవలం నొప్పే కాదు, నా జీవితంలో ఎంతో కీలకమైన జిమ్‌కు దూరమవ్వడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇక జిమ్ అంటే కేవలం వర్కవుట్ చేసే ప్రదేశం మాత్రమే కాదు, నా మైండ్‌ను క్లియర్ చేసుకునే ప్రశాంతమైన చోటు" అని రకుల్ ఎమోషనల్ అయ్యారు.




ఓపిక, కోలుకోవడం నేర్పిన పాఠాలు:

గాయం నుంచి కోలుకునే క్రమంలో తానెంతో నిరాశకు గురయ్యానని, కానీ శరీరం కోలుకోవడానికి సమయం పడుతుందని అర్థం చేసుకున్నానని రకుల్ తెలిపారు. "వర్కవుట్స్ నేర్పని అనేక విషయాలను నా రికవరీ సమయం నేర్పించింది. ఇక మనసుకు ఎంత వేగంగా వెళ్లాలని ఉన్నా ఓపిక పట్టడం నేర్చుకున్నాను. బలం అనేది కేవలం భారీ బరువులు ఎత్తడంలోనే ఉండదు, ఒక్కోసారి శరీరం కోరుకునే విశ్రాంతిని ఇవ్వడంలోనూ ఉంటుందని గ్రహించాను. చిన్న చిన్న మార్పులనే విజయాలుగా భావించడం మొదలుపెట్టాను" అని రాసుకొచ్చారు.




నా ఇంటికి తిరిగొచ్చినట్టుంది:

జిమ్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన అనుభూతిని వివరిస్తూ.. "దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లోకి అడుగుపెట్టడం చాలా సుపరిచితంగా, సుదీర్ఘ ప్రయాణం తర్వాత సొంత ఇంటికి తిరిగొచ్చినట్టుగా ఉంది. అయితే ఐదేళ్ల క్రితం జిమ్ బయటకు వెళ్లిన రకుల్, ఇప్పటి రకుల్ ఒకరు కారు. సరికొత్త అనుభవాలు, పాఠాలతో కొత్త దృక్పథంతో మళ్లీ ప్రయాణం మొదలుపెడుతున్నాను. ఇక పాత రకుల్‌ను నేనేమీ ఛేజ్ చేయడం లేదు.. ఆ చాప్టర్ ముగిసింది. ఒక బలమైన ఆలోచనతో మళ్లీ కొత్తగా మొదలుపెడుతున్నాను" అని రకుల్ స్పష్టం చేశారు.

చేతినిండా పాన్-ఇండియా ప్రాజెక్టులు:

ఒకవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూనే మరోవైపు భారీ ప్రాజెక్టులతో రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ్'లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ బ్యూటీ, లోకనాయకుడు కమల్ హాసన్ - లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా 'ఇండియన్ 3' లోనూ నటిస్తున్నారు.

స్ఫూర్తిని నింపుతున్న రకుల్:

గాయం వల్ల ఎంతటి కష్టం ఎదురైనా, అంతే ఆత్మవిశ్వాసంతో మళ్లీ కోలుకుని జిమ్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ నెటిజన్లను, ఫిట్‌నెస్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ముందుకు సాగాలని చెప్పిన రకుల్, అటు సినిమాలతో పాటు ఇటు ఫిట్‌నెస్ ప్రయాణంలోనూ మరింత సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.