రకుల్-రెజీనా ఎంత క్లోజ్ ప్రెండ్స్ అంటే?
అంతే కాదు ఇద్దరు సినిమా అవకాశాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో తమకున్న పరిచ యాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం క్లోజ్ అయిన దగ్గర నుంచి మొదలైందన్నారు.
By: Srikanth Kontham | 4 Sept 2025 8:45 AM ISTచిత్ర పరిశ్రమలో హీరోయిన్ల మధ్య క్లోజ్ ప్రెండ్స్ కాంబినేషన్ అన్నది పెద్దగా కనిపించదు. ఒక్కొక్కరు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇలా దేశంలో ఎక్కడై నుంచైనా దిగుమతి అవుతుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత క్లోజ్ అవ్వాలి తప్పితే ముందే ఏ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రెండ్ షిప్ ఉండదు. కనీసం కాంటాక్ట్ కూడా ఉండదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్- రెజీనా క్లోజ్ ప్రెండ్స్ అన్న సంగతి ఎంత మందికి తెలుసు? అవును ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ఒకే రూమ్ షేర్ చుసుకునేంత.
ఒకే రూమ్ లో చిలౌట్:
మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇద్దరు వేర్వరు ప్రాంతాల నుంచి వచ్చిన వారే. రకుల్ పుట్టి పెరిగింది.. చదువు అంతా ఢిల్లీలోనే. రెజీనా తమిళనాడు ప్రాంతానికి చెందిన అమ్మాయి. అమ్మడి చదువంతా చెన్నైలోనే సాగింది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లింది లేదు. మరి అంత క్లోజ్ ఎలా అయ్యారంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే ఇద్దరు క్లోజ్ అయ్యారు. అటుపై విదేశాలకు కలిసి వెకేషన్లకు వెళ్లడం. అక్కడ ఇద్దరు ఒకే రూమ్ లో దిగడం...కలిసి విదేశీ అందాలు ఆస్వాదించడం చేసినట్లు రకుల్ తెలిపింది.
అవకాశాలు షేర్ చేసుకుంటూ:
అంతే కాదు ఇద్దరు సినిమా అవకాశాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో తమకున్న పరిచ యాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం క్లోజ్ అయిన దగ్గర నుంచి మొదలైందన్నారు. రకుల్ ప్రత్ సింగ్ కోలీవుడ్ లో సినిమాలు చేయడానికి కారణం రెజీనానే కారణమంటోంది. తనకి రాని అవకాశాలు కొన్నిం టిలో రకుల్ నటించినట్లుగా చెబుతోంది. ఆడిషన్స్ కు వెళ్లిన సమయంలో తాను ఫిట్ అవ్వని రోల్ కు రకుల్ ఫిట్ అవ్వడం కారణంగా ఇంకొన్ని అకాశాలు అందుకుందిట. అలాగని స్నేహితురాలి రుణాన్ని రకుల్ ఉంచుకోలేదు.
కల్మశం లేని స్నేహం:
బాలీవుడ్ లో రెజీనా అవకాశాలు అందుకోవడానికి తానే కీలక పాత్ర పోషిస్తుందిట. ప్రస్తుతం రెజీనా బాలీవు డ్ లో మూడు సినిమాలు చేస్తోంది. ఆ మూడింట్లో రెండు చిత్రాలు రకుల్ తో స్నేహం కారణంగానే వచ్చా యన్నది తాజా సమాచారం. మొత్తానికి రకుల్-రెజీనా స్నేహం ఎంత గొప్పదన్నది ఈ సన్నివేశం రుజువు చేస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఇద్దరు నటీమణుల మద్య పొసగడం అంత సులభం కాదు. ఏ విష యం ఎలా ఉన్నా? సినిమా అవకాశాలకు వచ్చే సరికి పోటీ నెలకొంటుంది. ఎవరికి వారు ఆ ఛాన్స్ తనకే రావాలని ఎవరి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రకుల్-రెజీనా స్నేహం మాత్రం అందుకు భిన్నం. తన కంటే తన స్నేహితురాలికే ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్నంత పాజిటివ్ మైండ్ తో ఇద్దరి స్నేహం ఎంతో స్వచ్ఛంగా ఉంది.
