Begin typing your search above and press return to search.

రెడ్ ఔట్ ఫిట్ లో హీట్ పెంచేసిన రకుల్.. లేటెస్ట్ లుక్ వైరల్!

లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ట్రెండీ లుక్ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న నేటితరం హీరోయిన్స్.. అందుకు తగ్గట్టుగానే గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

By:  Madhu Reddy   |   12 Aug 2026 7:00 PM IST
రెడ్ ఔట్ ఫిట్ లో హీట్ పెంచేసిన రకుల్.. లేటెస్ట్ లుక్ వైరల్!
X

లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ట్రెండీ లుక్ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న నేటితరం హీరోయిన్స్.. అందుకు తగ్గట్టుగానే గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు సెలబ్రిటీల అందాల జాతర అభిమానులకు కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అందాలను ఆరబోస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది గ్లామర్ వలక పోస్తే మరి కొంతమంది సాంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక అలా నిత్యం ఫాలోవర్స్ కి చేరువలో ఉంటూ లేటెస్ట్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.





అందం, అభినయంతో, నటనతో ఆకట్టుకుంటూ ఇటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఈమె.. తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఈ ఫోటోలు యువతను ఫిదా చేస్తున్నాయి. రకుల్ ధరించిన ఈ లేటెస్ట్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. ప్రముఖ డిజైనర్ నీతూ రోహ్రా డిజైన్ చేసిన స్వరోవ్ స్కీ అలంకరణలతో కూడిన ప్రత్యేకమైన ముదురు ఎరుపు రంగు డ్రెస్ ఈమె ధరించింది.





షోల్డర్ లెస్ కాలమ్ ఫ్రాక్ ఇది. దీనికి చక్కగా స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో లోతైన షీర్ మెష్ ఇన్సర్ట్ తో స్టిచ్ చేశారు. ముఖ్యంగా ఈ డ్రెస్ మొత్తం ఒకే రంగులో విభిన్న ఆకృతులు కలిగిన స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ తో చాలా దట్టంగా, నిండుగా డిజైన్ చేశారు. నడుము భాగం వద్ద బిగుతుగా ఉండి.. దీనికి మ్యాచింగ్ గా రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తో బెల్ట్ డిజైన్ చేయగా.. దానికి మధ్యలో ఒక చక్కని బో లాగా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ బాటంలో ఫిష్ కట్ ను తలపించేలా డిజైన్ చేశారు. మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.





తొలిసారి 2011లో కెరటం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక దాని తర్వాత రఫ్ , లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేసుకో, బ్రూస్లీ, కిక్ 2 , నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక , ఇలా ప్రతి చిత్రం కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. అయితే చివరిగా తెలుగులో మన్మధుడు 2 చిత్రం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయింది. ఆ తర్వాత చెక్, కొండ పొలం, బూ వంటి చిత్రాలు చేసింది కానీ ఇవి ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఇండియన్ 3 సినిమాలో కూడా నటిస్తోంది.