రకుల్ మెడపై ఏంటా స్టిక్కర్?
ఇది శరీరంలో ఉండే మూల కణాల్ని ఉత్తేజపరిచేలా చేస్తుందట. ఇది శరీరానికి కొత్త ఎనర్జీ లెవెల్స్ ను పెంచేలా చేస్తుందట.
By: Madhu Reddy | 1 Sept 2025 11:30 AM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లో కూడా పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది. ముఖ్యంగా సౌత్ లో కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన డైలీ యాక్టివిటీస్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రకుల్ మెడపై స్టికర్..
అలాంటి ఈమె తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆందోళనపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఎప్పుడు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టే ఈమె మెడపై సడన్గా తెల్లటి గుండ్రటి ఒక స్టిక్కర్ కనిపించేసరికి రకుల్ కి ఏమైంది? ఏంటా స్టిక్కర్ ?అంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ స్టిక్కర్ గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.
రకుల్ మెడపై ఆ స్టిక్కర్ ఏంటంటే?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా తన ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ గాడ్జెట్ ను ఉపయోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రకుల్ ధరించిన ఆ స్టిక్కర్ పేరు "లైఫ్ వేవ్ ఎక్స్ -39 స్టెమ్ సెల్ ప్యాచ్" అన్నట్లుగా తెలుస్తోంది.. దీనిని ధరించడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు సైతం తెలుపుతున్నారు.
ఆ స్టిక్కర్ అందుకే వేసుకుందా?
ఇది శరీరంలో ఉండే మూల కణాల్ని ఉత్తేజపరిచేలా చేస్తుందట. ఇది శరీరానికి కొత్త ఎనర్జీ లెవెల్స్ ను పెంచేలా చేస్తుందట. అలాగే చర్మాన్ని కాంతివంతంగా ఉండడంతో పాటు కండరాలని కూడా మరింత ఉత్తేజింపచేసేలా చేస్తుంది. అని నిపుణులు చెబుతున్నారు. ఇలా బోలెడు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ స్టిక్కర్ ని ధరించినట్లు సమాచారం. అయితే ఈ ప్యాచ్ కేవలం రోజులో 12 గంటలు మాత్రమే పెట్టుకోవాలి. ఈ ప్యాచ్ ను కూడా రకుల్ ప్రీత్ సింగ్ విదేశాల నుంచి తెప్పించుకొని మరీ ఉపయోగిస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు..
బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న ఈమె.. అక్కడే పలు సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగానే 'మేరీ హస్బెండ్ కి బీవీ' అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు అజయ్ దేవగన్ తో కలిసి 'దేదే ప్యార్ దే 2' సినిమాలో నటిస్తోంది. ఇందులో టబు, ఆర్. మాధవన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
