Begin typing your search above and press return to search.

రెయిన్బో కలర్స్ లో కొంటెగా కవ్విస్తున్న శూర్పణఖ!

‘రామాయణం’లో శూర్పణఖగా ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మల్టీకలర్ ఫ్లోరల్ ఫ్రాక్‌లో మెరిసింది. సాక్షా, కిన్నీ డిజైన్ చేసిన ఈ డ్రెస్‌తో సింపుల్ జ్యువెలరీ, ఫ్లాట్ శాండిల్స్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించింది. భర్త జాకీ భగ్నానితో కలిసి ఓ ఈవెంట్‌లోనూ సందడి చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   17 Nov 2026 12:01 PM IST
రెయిన్బో కలర్స్ లో కొంటెగా కవ్విస్తున్న శూర్పణఖ!
X

గ్లామర్ అందాలతో నిత్యం ఆకట్టుకుంటూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ,నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బాలీవుడ్ ఇతిహాస మహాకావ్యం రామాయణ చిత్రంలో రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాత్ర వెనుక ఇంత కథ ఉందా అని సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఒక పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది.




తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మల్టీకలర్ ఫ్రాక్ లో దర్శనమిచ్చి అందరినీ అలరించింది ఈ ముద్దుగుమ్మ .ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె పంచుకున్న ఫోటోల విషయానికి వస్తే.. ప్రముఖ డిజైనర్ లేబుల్ సాక్షా, కిన్నీ రూపొందించిన మారిలిన్ డ్రెస్ ఈమె ధరించింది. స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో సన్నని అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కలిగిన మిడి - లెంగ్త్ ఫ్లేర్డ్ డ్రెస్ ఇది. దీనిపై ఆరెంజ్ , ఎల్లో అలాగే మల్టీకలర్ పూల ప్రింట్ లు డిజైన్ చేశారు. స్ట్రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన దీని విలువ సుమారుగా 23 వేల వరకు ఉంటుంది. తన లుక్ ను పరిపూర్ణం చేసుకోవడానికి ఫ్లాట్ శాండిల్స్ ధరించిన ఈమె.. మెడలో సింపుల్ గా సన్నని లేయర్డ్ చైన్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది.




పైగా ఈ లుక్కుతో ఇటీవల తన భర్త జాకీ భగ్నానితో కలిసి ఒక ఈవెంట్లో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.




రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ విషయానికొస్తే.. నితీష్ తివారీ దర్శకత్వంలో మనీష్ మల్హోత్రా భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం రామాయణ. ఇందులో శూర్పనఖ పాత్ర పోషించి ఆకట్టుకుంది.. ఇక రావణాసురుడిగా యశ్ , రాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి పలువురు కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 5 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఊహించని కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. చివరిగా దేదే ప్యార్ దే టు, పతీ పత్ని ఔర్ ఓ దో వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కీలకపాత్ర పోషిస్తున్న ఇండియన్ 3 చిత్రంలో నటిస్తోంది . ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే రకుల్ కి సౌత్ లో వరుస అవకాశాలు మళ్లీ వస్తాయని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి చూద్దాం రకుల్ కి ఇండియన్ 3 మూవీ ఏ విధంగా కలిసి వస్తుందో.