Begin typing your search above and press return to search.

అవార్డ్స్ వేడుకల్లో గ్లామర్ క్వీన్.. హీట్ పెంచేసిన రకుల్!

గ్లామర్ కి సరికొత్త నిర్వచనం చూపిస్తూ.. అందరి దృష్టిని తన వైపు లాక్కునే రకుల్ ప్రీత్ సింగ్.. మరొకసారి గ్లామర్ క్వీన్ గా నిరూపించుకుంది.

By:  Madhu Reddy   |   7 Aug 2026 12:00 PM IST
అవార్డ్స్ వేడుకల్లో గ్లామర్ క్వీన్.. హీట్ పెంచేసిన రకుల్!
X

గ్లామర్ కి సరికొత్త నిర్వచనం చూపిస్తూ.. అందరి దృష్టిని తన వైపు లాక్కునే రకుల్ ప్రీత్ సింగ్.. మరొకసారి గ్లామర్ క్వీన్ గా నిరూపించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ చిన్నది.. తాజాగా HT మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2026 వేడుకలో తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ఈవెంట్లో ఆమె గ్లామరస్ లుక్ , స్టైలిష్ అప్పియరెన్స్ చాలా హైలెట్ గా నిలిచాయి.




మోడ్రన్ అవుట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పై సందడి..

జారా ఉమ్రిగర్ డిజైన్ చేసిన ప్రత్యేకమైన చిరుత పులి ప్రింట్ గౌన్ ను ఈమె ధరించింది. టాప్ టు బాటమ్ చిరుత పులి ప్రింట్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ పై అత్యంత క్లిష్టమైన పూసలతో ఎంబ్రాయిడరీ చేశారు. డీప్ వీ నెక్ కలిగిన ఈ డ్రెస్ కి బ్లాక్ కలర్ బెల్ట్ తో మ్యాచ్ చేశారు. పైగా వన్ సైడ్ డీప్ కట్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. మొత్తానికైతే ఈ మోడ్రన్ అవుట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన రకుల్ గ్లామర్ లుక్కుకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.




క్వీన్ ఆఫ్ స్టైల్ అవార్డ్..

ఇటీవల జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో HT అవార్డు వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్ క్వీన్ ఆఫ్ స్టైల్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె అవార్డు తీసుకున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.." క్వీన్ ఆఫ్ స్టైల్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన అవార్డు. స్టైల్ నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. స్టైల్ చాలా లోతుగా వ్యక్తిగతంగా నాలో భాగమయ్యింది. ముఖ్యంగా నేను ధరించే దుస్తుల గురించి కాదు.. నేను దానిలో ఎలా మునిగితేలుతున్నానో అనే దాని గురించే నాకు అవార్డు లభించినట్లు తెలుస్తోంది. సౌకర్యం, విశ్వాసం ఎల్లప్పుడూ నన్ను నేను వ్యక్తికరించడానికి ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ లుక్ వెనుక ఉన్న ఆలోచన నా స్థిరమైన స్ఫూర్తి కి ప్రతిబింబం. నన్ను ఇంత అందంగా మార్చిన నా ప్రత్యేకమైన బృందానికి ధన్యవాదాలు" అంటూ తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.




రామాయణ చిత్రంలో కీలకపాత్ర..

2013లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. లౌక్యం, పండగ చేసుకో , సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక , స్పైడర్ అంటూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరిగా దేదే ప్యార్ దే 2 చిత్రంతో ఆడియన్స్ ను అలరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీ రామాయణ చిత్రంలో రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర పోషిస్తుంది.