పెర్ఫెక్ట్ ఫోటో ఫోజ్.. లెహంగాలో మెస్మరైజ్ చేస్తున్న రకుల్!
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు వారికి అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.
By: Madhu Reddy | 26 Oct 2025 2:00 PM ISTపంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు వారికి అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎంతోమంది ఆకర్షితులవుతూ ఉంటారు. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చాలావరకు తెలుగు సినిమాలు హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమాలు ప్రకటించకపోయినప్పటికీ బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఈ హీరోయిన్ నటించిన తాజా మూవీ 'దే దే ప్యార్ దే -2' మూవీకి సంబంధించి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తళ తళ మెరిసిపోయే లెహంగాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఆ ఫోటోల కింద దీపావళి ఇదే లాస్ట్ అని నేను హామీ ఇస్తున్నాను. కానీ ఈ ఆడియో యూస్ చేయడం చివరిది కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.అలాగే రాత్ బర్ పాటలో మునిగిపోయాను అంటూ రాత్ బర్ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఇక లేటెస్ట్ ఇన్స్టా పోస్టులో రకుల్ ప్రీత్ సింగ్ జిగేలుమనే మెరిసే లెహంగాలో మరింత అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ టాప్ తో నెట్టెడ్ చున్నితో పెయిరప్ చేసింది. అలాగే నెక్ చౌకర్,చెవి కమ్మలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఇన్స్టా ఫొటోస్ వైరల్ గా మారడంతో పాటు ఆమె పెట్టిన హ్యాష్ ట్యాగ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మూవీ నుండి రాత్ బర్ అనే సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే..
దే దే ప్యార్ దే-2 మూవీ విషయానికి వస్తే.. దేదే ప్యార్ దే మూవీ కి సీక్వెల్ గా వస్తున్న దే దే ప్యార్ దే -2 మూవీ లో అజయ్ దేవగన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తన చిన్ననాటి స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి వయసు ఎంత ఉంటుందో అజయ్ దేవగన్ వయసు అంత ఉంటుంది. అలా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో రకుల్ తండ్రి అజయ్ దేవగన్ తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పాటు మరో అబ్బాయిని రకుల్ ప్రీత్ సింగ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు.మరి రకుల్ ని పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లిదండ్రులను అజయ్ దేవగన్ ఏ విధంగా ఒప్పిస్తారు అనేది ఈ సినిమాలో చూడాల్సిందే.
దేదే ప్యార్ దే -2 మూవీ నవంబర్ 14 విడుదల కాబోతోంది.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ లతో పాటు ఆర్.మాధవన్ రకుల్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే-2 మూవీ తో పాటు ఆయుష్మాన్ ఖురానా తో కలిసి పతి పత్నీ ఔర్ ఓ మూవీ సీక్వెల్ లో కూడా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.
